కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ముగ్గురు కోతులు’. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
బ్యాచిలర్ జీవితం, స్నేహం నేపథ్యంలో సరదాగా సాగేలా ఈ పాటను రూపొందించారు. ఈ పాటకు జగదీష్ బుసయవలస సాహిత్యం అందించగా, చైతన్య గన్నవరపు ఆలపించారు. ఎస్. సుహాస్ సంగీతం సమకూర్చారు.
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహకారంతో శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి రాజ్ నోముల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులకు సిద్ధమవుతూ షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా విడుదల తేదీని, ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


