ఫోక్ సింగర్ కిట్టు హీరోగా కొత్త సినిమా ప్రారంభం

ఫోక్ సింగర్ కిట్టు హీరోగా కొత్త సినిమా ప్రారంభం

Published on Aug 29, 2026 8:00 AM IST

జానపద పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ కిట్టు కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. యం.యస్ వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా పతాకాలపై ముని శివ, శివ మల్లాల సంయుక్తంగా ప్రొడక్షన్ నం. 3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిలీప్ సాయి నాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శివమ్ మీడియా కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.

ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, దర్శకులు ఆర్పీ పట్నాయక్, సతీష్ వేగేశ్న, బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు దిలీప్‌కి సతీష్ వేగేశ్న, ‘బుల్లెట్ బండి’ లక్ష్మణ్ స్క్రిప్ట్ అందించారు. ముహూర్తపు సన్నివేశానికి చంద్రబోస్ క్లాప్‌ కొట్టగా, ఆర్పీ పట్నాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. విజయ్ వెన్నం కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఈ సందర్భంగా గేయ రచయిత చంద్రబోస్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ నిర్మాతలు మరిన్ని మంచి చిత్రాలు రూపొందించాలని ఆర్పీ పట్నాయక్, సతీష్ వేగేశ్న పేర్కొన్నారు. జానపద పాటల ద్వారా వచ్చిన గుర్తింపుతో వెండితెరకు పరిచయమవుతున్న తనకు సినీ ప్రముఖుల ఆశీస్సులు లభించడం సంతోషంగా ఉందని హీరో కిట్టు తెలిపారు. ఈ చిత్రానికి మదిన్ సంగీతం సమకూరుస్తుండగా, జనతా బబ్లూ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు