నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం దాదాపు పూర్తి కావస్తుండగా మేకర్స్ ఈ సినిమా నుంచి అవైటెడ్ రెండో సాంగ్ యేశనాగులని విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ విడుదలకి ముందే ఏ రేంజ్ లో ఉంటుంది అనేది అందిరిలో అందరిలో ఓ క్లారిటీ ఉంది.
అయితే మొదట ఆడియో వెర్షన్ ని విడుదల చేసి తర్వాత వీడియో లిరికల్ ని విడుదల చేశారు మేకర్స్. కానీ ఈ వెర్షన్ కి అనూహ్యంగా వేరే ఫీడ్ బ్యాక్ ఆడియెన్స్, నెటిజన్స్ నుంచి వస్తుండడం గమనార్హం. ముఖ్యంగా సాంగ్ కొరియోగ్రఫీ విషయంలో ఫీడ్ బ్యాక్ తేడాగా ఉంది. ఆట సందీప్ ఈ సాంగ్ కి నృత్య సహకారం అందించారు.
అయితే ఈ సాంగ్ బీట్స్ కి తగ్గ రేంజ్ లో స్టెప్పులు లేవనేది ఆడియెన్స్ మాట. ఆ బీట్స్ కి ఫాస్ట్ గా లేకుండా సింపుల్ గా ఉండడంతో ఈ డోస్ సరిపోలేదని అంటున్నారు. ఇప్పుడైతే చెయ్యడానికి ఏమీ లేదు. సో ఈ సాంగ్ అలవాటు అవుతుందో లేక మేకర్స్ ఏమన్నా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


