యశ్ డేరింగ్ అటెంప్ట్ తో నేనున్నాను.. ‘టాక్సిక్’ రిజల్ట్ పై ‘కాంతార’ హీరో!

యశ్ డేరింగ్ అటెంప్ట్ తో నేనున్నాను.. ‘టాక్సిక్’ రిజల్ట్ పై ‘కాంతార’ హీరో!

Published on Aug 30, 2026 1:00 AM IST

కన్నడ సినిమా నుంచి తాజాగా వచ్చిన గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్ నే ‘టాక్సిక్’. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో చేసిన ఈ ప్రయోగాత్మక భారీ చిత్రం అనుకున్న రేంజ్ స్పందన ఆడియెన్స్ నుంచి అందుకోలేదు. రెండో రోజు నుంచే భారీగా డ్రాప్ చూసిన ‘టాక్సిక్’ పై తాజాగా కన్నడ స్టార్ నటుడు కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమా విషయంలో యశ్ తో తోడుగా నిలబడుతున్నాను అని చెప్పుకొచ్చారు.

తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో టాక్సిక్ సబ్జెక్టు కోసం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తాను చేశారు. టాక్సిక్ లాంటి సినిమా ప్రయాణంలో కథ, కొన్ని పాత్రలు అనుకున్నట్టుగా ప్రయాణించకపోవచ్చు అలాగని సినిమా నడిచే ట్రాక్ తప్పు కాదని సూచించారు.ఒక నటుడుగా ఒక పాత్రని పోషిస్తున్నపుడు దానిని హృదయం లోతుల్లోనుంచి ఆవిష్కరించేందుకు ఎంత నిబద్దత కావాలో నాకు తెలుసు ఆ నిబద్దత చూసి నేను ముగ్దున్ని అయ్యానని రిషబ్ తెలిపారు.

యష్ సార్ ఒక లార్జర్ దన్ లైఫ్ నటనను డిమాండ్ చేసే ఒక పాత్రకు, ఆ ప్రపంచానికి మిమ్మల్ని మీరు మార్చుకున్న విధానానికి హ్యాట్సాఫ్. ప్రతి ఒక్క సన్నివేశంలోనూ నేను దానిని స్పష్టంగా అనుభూతి చెందాను అని తెలిపారు. అలాగే టాక్సిక్ చిత్రంలో చెప్పాలనుకున్న గిల్ట్ పాయింట్ మనిషి జీవితంలో టాక్సిసిటీ ఎలా పెంచుతుంది అనే ప్రయోగాత్మక డేరింగ్ స్టెప్ ని మీరు అటెంప్ట్ చేయడం మామూలు విషయం కాదు.

ఈ ప్రయత్నానికి నేను మీతో అండగా నేను నిలబడతాను. కన్నడ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే మీ ప్రేమకు, తపనకు మేము మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాము. అని ఈ సినిమా రిజల్ట్ విషయంలో రిషబ్ శెట్టి తనదైన శైలిలో స్పందించి సపోర్ట్ అందించారు. దీనితో యష్ అభిమానులు రిషబ్ రెస్పాన్స్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు