పవన్ బర్త్డే.. స్పెషల్ విషెస్ చెప్పిన భార్య అన్నా..!

పవన్ బర్త్డే.. స్పెషల్ విషెస్ చెప్పిన భార్య అన్నా..!

Published on Sep 2, 2026 9:07 AM IST

అన్నా కొణిదెల తన భర్త, పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఒక అందమైన, క్యాండిడ్‌ ఫోటోను షేర్‌ చేస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. “ఈరోజు మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారు. మీరు ఇతరుల జీవితాలను ఎంతగా స్పృశించారో, ఎంతగా సేవ చేశారో ఇది తెలియజేస్తుంది. జన్మదిన శుభాకాంక్షలు!” అంటూ ఆమె రాసుకొచ్చిన మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

​అన్నా కొణిదెల రాసిన ఈ బర్త్డే మెసేజ్ పవన్‌ కల్యాణ్‌పై ఆమెకు ఉన్న ప్రేమను చాటిచెప్పడమే కాకుండా, సమాజంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి ఆయన సంపాదించుకున్న అపారమైన ప్రేమను, గౌరవాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ ఇంటెన్సివ్ ఫోటో మరియు ఆమె మనసులోని భావాలను వ్యక్తపరిచిన తీరు, ఈ పుట్టినరోజు వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తాజా వార్తలు