షాకింగ్: దుల్కర్ సినిమాకి చివరి నిమిషంలో చిక్కులు?

షాకింగ్: దుల్కర్ సినిమాకి చివరి నిమిషంలో చిక్కులు?

Published on Sep 3, 2026 12:00 AM IST

మలయాళ యువ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే ‘ఐమ్ గేమ్’. దర్శకుడు నహాస్ హైదయత్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ గ్యాంబ్లర్ థ్రిల్లర్ గత నెల లోనే విడుదల కావాల్సి ఉంది కానీ ఆలస్యం అయ్యింది. ఇలా పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 3న గ్రాండ్ విడుదలకి సిద్ధం చేశారు కానీ చివరి నిమిషంలో ఊహించని షాక్ లు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం తాలూకా సెకండాఫ్ కంటెంట్ ఇంకా డెలివరీ కాలేదు అనే కొన్ని వార్తలు ఇపుడు వినిపిస్తున్నాయి. ఫస్టాఫ్ వచ్చింది కానీ తెలుగు సహా కొన్ని భాషల్లో దుల్కర్ సినిమా సెకండాఫ్ కంటెంట్ రావడంలో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. సో రేపు ఉదయం షోస్ పడతాయా లేదా అనేది సందేహంగా మారింది. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతం అందించగా దుల్కర్, జామ్ వర్గేసి నిర్మాణం వహించారు.

తాజా వార్తలు