యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, టాలెంటెడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ యూూత్ ఫుల్ ఎంటర్టైనర్కు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ లవ్ స్టోరీ, టీనేజ్ అల్లరి, చక్కటి భావోద్వేగాలతో కట్ చేసిన ఈ విజువల్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చాయి. ఈ ట్రైలర్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా, సరికొత్త పద్ధతిలో వర్కౌట్ అయింది. డైరెక్టర్ ఆదిత్య హాసన్ తనదైన శైలిలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియాలిస్టిక్‌గా, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా మలిచినట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడు హేషమ్ అందించిన మ్యాజికల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేస్తోంది. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ జోనర్లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ అనుభూతిని పంచుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


