ఓటీటీ లోకి ఎడిషన్ ఆఫ్ ఇండియా సినిమా.. ‘ధురందర్’ స్టార్ నటించిన సినిమా ఎందులో అంటే!

ఓటీటీ లోకి ఎడిషన్ ఆఫ్ ఇండియా సినిమా.. ‘ధురందర్’ స్టార్ నటించిన సినిమా ఎందులో అంటే!

Published on Sep 4, 2026 5:57 PM IST

గత నెల థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాల్లో భారతీయ శాస్త్రవేత్తల్లో ఎడిషన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త అది కూడా మన తెలుగు నేలకు చెందిన శాస్త్రవేత్త గోపాల స్వామి దొరస్వామి నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా జీడీ నాయుడు కూడా ఒకటి. ధురందర్ నటుడు ఆర్ మాధవన్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి హిందీ మార్కెట్లో మంచి ప్రశంసలు దక్కాయి.

దర్శకుడు కృష్ణ కుమార్ రామ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు విడుదల అయినట్టు కూడ చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీలో విడుదలకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని కూడా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నేటి నుంచి అందుబాటులోకి తెచ్చేసింది. సో ఈ ప్రసిద్ధి గాంచిన శాస్త్రవేత్త కోసం అది కూడా తెలుగు శాస్త్రవేత్త కోసం తెలుసుకోవాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది చూసేయ్యండి. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించారు. అలాగే మాధవన్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు