టాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ చిత్రాలను రూపొందించే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా సపోర్ట్ చేయడంలో ముందుంటారు. ఇక ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే అందులో ఖచ్చితంగా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసే అంశాలు ఉంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఈ బ్యానర్ నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు డబుల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ చిత్రాలు రావడమే దీనికి ఉదాహరణ.
ఒకే విడుదల తేదీన రెండు సినిమాలను తీసుకొచ్చి, రెండింటినీ బ్లాక్‌బస్టర్లుగా నిలిపిన అరుదైన రికార్డును మైత్రీ మూవీ మేకర్స్ సాధించింది. 2023 సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’, ఏప్రిల్ 2025లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ – ‘జాట్’, ఆగస్టు 2026లో ‘ఇరుముడి’ – ‘మొధ రాత్రి’ చిత్రాలతో ఈ తమ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసింది ఈ ప్రొడక్షన్ సంస్థ.
ఇలా మూడు వేర్వేరు సందర్భాల్లో ఒకే రోజున విడుదల చేసిన ఆరు సినిమాలనూ సూపర్‌హిట్‌లుగా మలచి, ఇండియన్ సినిమాలో ఈ నిర్మాణ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది.


