‘ఆ నలుగురు’, ‘మధుమాసం’ చిత్రాల దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ రూపొందించిన తాజా చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించిన ఈ మిస్టరీ మ్యూజికల్ థ్రిల్లర్‌ను సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ చిత్రంతో హర్ష కథానాయకుడిగా పరిచయమవుతుండగా అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. దివంగత రచయిత, దర్శకుడు మదన్ అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కింది.
రోజూ రాత్రి ఓ రేడియో స్టేషన్ నుంచి వచ్చే పాట, దాన్ని కోరే కొందరు వ్యక్తుల చుట్టూ కథ తిరుగుతుందని దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెలిపారు. సౌండ్ థెరపీ, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావనల నేపథ్యంలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సాగుతుంది.
జే రెక్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. పులగం చిన్నారాయణ మాటలు రాయగా, సామ్ సుప్రీత్ సినిమాటోగ్రఫీ అందించారు.


