యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా టాలెంటెడ్ యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన రోమ్ కామ్ చిత్రమే ‘ఎపిక్’. తన ఓటీటీ హిట్ 90స్ బయోపిక్ కి కొనసాగింపుగా ప్లాన్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది.
అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ నిన్న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి ఆనంద్ సోదరుడు విజయ్ దేవరకొండ భార్య, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తన మరిది సినిమా కోసం ముఖ్య అతిథిగా విచ్చేసింది. అయితే తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఫుల్ జోష్ నింపిన రష్మిక ఈ సినిమా ప్రీమియర్స్ తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేసేసింది.
దీనితో ఈ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. సో మేకర్స్ ఈ సినిమా విషయంలో గట్టి నమ్మకం గానే ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి హీషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా నిర్మాణం వహించారు. అలాగే ఈ సెప్టెంబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
Just a few days away from meeting Aditya & Kadali! ❤️❤️#EPIC ~ First Semester Grand Premieres on Sep 10th 💥💥💥 pic.twitter.com/vcb85L9AN2
— Sithara Entertainments (@SitharaEnts) September 4, 2026


