‘తెల్లకాగితం’ ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నా – దిల్ రాజు

‘తెల్లకాగితం’ ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నా – దిల్ రాజు

Published on Sep 5, 2026 10:58 AM IST

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘తెల్ల కాగితం’. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బాబీ చేతుల మీదుగా శనివారం నాడు ఆవిష్కరించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘కొత్త బంగారు లోకం’ నాటి అనుభూతిని గుర్తుచేసేలా 2000ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ ఇదని కొనియాడారు. జీవితంలో తెలిసీ తెలియక చేసే తప్పుల వల్ల తెల్లటి ప్రయాణంలో ఎర్ర మచ్చ పడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే సందేశాత్మక కథాంశంతో, నలుగురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా సాగుతుందని తెలిపారు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా దర్శకుడు రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ… ఇదొక బ్లాక్‌బస్టర్ కాన్సెప్ట్ ఉన్న ఇన్నోసెంట్ లవ్ స్టోరీ అని కొనియాడారు. సినిమా కథను తానూ ముందే విన్నానని, కథా రచయిత నందు, నిర్మాత కృష్ణలతో ఉన్న అనుబంధంతో ఈ ఈవెంట్‌కు వచ్చినట్లు తెలిపారు. హీరో హర్ష్ రోషన్ కథల ఎంపిక బాగుందని, తెలుగమ్మాయి నక్షత్రకు మంచి భవిష్యత్తు ఉందని ఆకాంక్షించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం, అజయ్ పాత్ర ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని, రమేష్ బండ్రెడ్డికి దర్శకుడిగా తొలి సినిమాతోనే పెద్ద విజయం దక్కాలని బాబీ శుభాకాంక్షలు తెలిపారు.

బివిఎస్ ర‌వి మాట్లాడుతూ.. చాలామంది నిర్మించాలని భావించినంత గొప్ప కథతో ఈ సినిమా రూపొందిందని కొనియాడారు. పరిశ్రమపై పూర్తి అవగాహన ఉన్న కృష్ణ కొమ్మాలపాటి వంటి పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. క్రమశిక్షణ ఉన్న హర్ష్ రోషన్, తెలుగమ్మాయి నక్షత్రలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ… విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుందని, దర్శకుడు రమేష్ ఈ ఇన్నోసెంట్ లవ్ స్టోరీతో త్రివిక్రమ్, సుకుమార్ ల స్థాయికి ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు.

హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీ పెద్దల మద్దతు తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన ప్యూర్, ఇన్నోసెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీ అని తెలిపారు. సరిగ్గా తన వయసుకు తగ్గ కథ తన వద్దకు వచ్చిందని, ‘7G బృందావన్ కాలనీ’, ‘ప్రేమిస్తే’ సినిమాల తరహాలో గుండెల్ని తాకేలా ఉండే ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ ఫీల్ అవుతారని చెప్పారు. అక్టోబర్ 2న థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులు ఒక మంచి అనుభూతితో వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో నటుడు రఘురాం, రాజ్‌కుమార్ కసిరెడ్డి, అజ‌య్, దర్శకుడు రామ్ అబ్బరాజు, భాను బోగ‌వ‌ర‌పు, రైట‌ర్ నందు స‌విరిగాన, బెక్కెం వేణు గోపాల్, నక్షత్ర, దర్శకుడు రమేష్ బండ్రెడ్డి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు