ప్రస్తుతం టాలీవుడ్ లో రానున్న కొన్ని వారాల్లో సినిమాలు విడుదల తేదీలు మారనున్నాయి అనే టాక్ ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టేస్తుంది. అలా వినిపిస్తున్న సినిమాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న లాంగ్ అవైటెడ్ సినిమా ది ప్యారడైజ్ కూడా ఒకటి. అయితే ఈ సినిమా సీజీ పనులు ఇంకా పూర్తి కానందున ఇంకో వారం లేదా రెండు వారాలు కూడా ఆగొచ్చు అనే ఫ్రెష్ రూమర్స్ మొదలయ్యాయి.
అయితే ఈ సినిమా విడుదల ఖరారు అయితే సరిగ్గా ప్యారడైజ్ రిలీజ్ తర్వాత రోజే విడుదలకి సిద్ధంగా ఉన్న హాలీవుడ్ సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్ రీరిలీజ్ సిద్ధంగా ఉంది. ఎండ్ గేమ్ ఎన్ కోర్ గా కొంత కొత్త ఫుటేజ్ తో కూడా కన్ఫర్మ్ చేసిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ప్యారడైజ్ ఆ రేస్ లో లేకపోతే థియేటర్స్ ఎక్కువ దొరికే ఛాన్స్ ఉంది. మరి దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.


