ప్రభాస్‌ను ఢీకొట్టేందుకు విశ్వక్ ప్రయత్నం.. వర్కవుట్ అయ్యేనా..?

ప్రభాస్‌ను ఢీకొట్టేందుకు విశ్వక్ ప్రయత్నం.. వర్కవుట్ అయ్యేనా..?

Published on Sep 6, 2026 12:06 AM IST

ఒక సినిమా విజయంలో సరైన విడుదల తేదీ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ రిలీజ్ డేట్‌ను డిసెంబరు 4గా ప్రకటించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే, దానికి సరిగ్గా ఒక్క రోజు ముందు, అంటే డిసెంబరు 3న రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ఫౌజీ’ విడుదల కానుంది.

ప్రభాస్ రేంజ్ సినిమా బరిలో ఉన్నప్పుడు సాధారణంగా ఇతర చిత్రాలు రెండు వారాల పాటు పోటీకి వెనుకాడతాయి. అలాంటిది విశ్వక్ సేన్ ఒక్క రోజు గ్యాప్‌లోనే రావడం పెద్ద సాహసమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక నిర్మాతల పక్కా వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది.

‘ఫౌజీ’ అనుకున్న తేదీకి రాకపోతే తమ సినిమాకు తిరుగుండదనే ఉద్దేశంతోనే ‘లెగసీ’ టీమ్ ఇలా ఈ డేట్‌పై కర్చీఫ్ వేసిందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ‘ఫౌజీ’ కచ్చితంగా డిసెంబరు 3నే థియేటర్లలోకి వస్తే మాత్రం, విశ్వక్ సేన్ సినిమా విడుదల తేదీ మారే అవకాశాలే ఎక్కువ. మరి ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్నట్లు వేసిన విశ్వక్ ప్లాన్ నిజంగా వర్కవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు