‘బాలయ్య’ సినిమా కోసం కొరటాల సన్నాహాలు !

‘బాలయ్య’ సినిమా కోసం కొరటాల సన్నాహాలు !

Published on Sep 6, 2026 9:02 AM IST

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ కి టీమ్ సన్నాహాలు చేస్తోంది. గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య, వచ్చే నెల నుంచి ఈ సినిమాకు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కొరటాల శివ సినిమా అనగానే.. కథ కంటే కూడా కథా నేపథ్యమే ఎక్కువగా గుర్తుకొస్తోంది. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉంది.

కాగా నేపథ్యం చుట్టూ.. ఆ ప్రాంతపు జీవన శైలిని సైతం కొరటాల, తన సినిమాలో చాలా బలంగా చూపిస్తారు. మరి ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమా నేపథ్యం ఏమిటో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు