శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాతో శివ నిర్వాణ స్థాయి పెరిగింది. ప్రధానంగా ‘ఇరుముడి’తో తనదైన మేకింగ్, కథన శైలితో దర్శకుడిగా శివ నిర్వాణ చాలా బాగా ఆకట్టుకున్నాడు. మరి, శివ నిర్వాణ.. మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు శివ నిర్వాణ ఎమోషనల్ టేకింగ్ తోడైతే ఓ డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, మాస్ ఇమేజ్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తే సినిమా మరింత ప్రత్యేకంగా నిలిచే ఛాన్స్ ఉంది. ఈ కాంబినేషన్ నిజమైతే మెగాస్టార్ అభిమానులకు ఇది ఖచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఏది ఏమైనా ఇరుముడి సినిమా విజయంలో దర్శకుడిగా శివ నిర్వాణ పాత్ర చాలా కీలకం. ప్రేక్షకులు సినిమా చూసి ఎమోషనల్ అవుతున్నారు అంటే..శివ నిర్వాణ రాసిన డైలాగ్స్ అండ్ సీన్లు చాలా బలంగా ఉండటమే కారణం. మరి మెగాస్టార్ – శివ నిర్వాణ కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందో చూడాలి.


