ఓటీటీ : ‘లస్ట్ స్టోరీస్ 3’ ప్రీమియర్ డేట్ ఫిక్స్ !

ఓటీటీ : ‘లస్ట్ స్టోరీస్ 3’ ప్రీమియర్ డేట్ ఫిక్స్ !

Published on Sep 6, 2026 12:00 PM IST

నెట్‌ఫ్లిక్స్ ఫేమస్ ఆంథాలజీ ‘లస్ట్ స్టోరీస్’ మూడవ భాగంతో తిరిగి రాబోతుంది. 2018లో వచ్చిన ఒరిజినల్ మరియు 2023లో వచ్చిన దాని సీక్వెల్ తర్వాత, ఈ ఫ్రాంచైజీ ప్రేమ, కోరిక మరియు నేటి జనరేషన్ రిలేషన్స్ పై మూడో భాగం రాబోతుంది. కాగా లస్ట్ స్టోరీస్ 3, సెప్టెంబర్ 18, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ తాజాగా ధృవీకరించింది.

ఈ ఆంథాలజీ సీరీస్ లో నాలుగు కథలు ఒకేసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లో విడుదలవుతాయి, ఇక ఈ చిత్రంలో రాధికా ఆప్టే, కొంకణ సేన్ శర్మ, విజయ్ వర్మ, అదితి రావు హైదరి, సిద్ధార్థ్, అలీ ఫజల్, రాధికా మదన్, అభిషేక్ బెనర్జీ, గురు ఫతే పిర్జాదా మరియు సనా థంపి నటిస్తున్నారు. ఈ చిత్రానికి విక్రమాదిత్య మోత్వానీ, కిరణ్ రావు, శకున్ బత్రా మరియు విశాల్ భరద్వాజ్ దర్శకులుగా వ్యవహరించగా, ఆర్‌ఎస్‌విపి మరియు ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించాయి.

తాజా వార్తలు