న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ థియేట్రికల్ రిలీజ్ డేట్‌పై సినీ వర్గాల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2026, సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే అధికారికంగా ప్రకటించారు.
అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తలకు మేకర్స్ తాజాగా చెక్ పెట్టారు. ఈ చిత్రాన్ని అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ‘ది ప్యారడైజ్’ రిలీజ్ రూమర్స్‌కు చెక్ పడింది.
‘దసరా’ లాంటి సంచలన విజయం తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో పెద్ద అసెట్‌గా మారింది.
#𝐓𝐇𝐄𝐏𝐀𝐑𝐀𝐃𝐈𝐒𝐄 in cinemas 𝟐𝟒-𝟎𝟗-𝟐𝟎𝟐𝟔 🎯🎯
All Posters with the date 🤗 : https://t.co/bvOWJpk0q7
— THE PARADISE (@TheParadiseOffl) September 7, 2026


