కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఇక థియేట్రికల్ రన్ దాదాపు ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రేజీ మూవీ సెప్టెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చేందుకు సిద్ధం అయ్యింది.
ఒరిజినల్ తమిళ్ తో పాటుగా డబ్బింగ్ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. సో ఇక ఓటీటీ లోకి వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంటుందో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు చిత్రాన్ని నిర్మించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


