నాని స్టార్ పవర్..యూఎస్ మార్కెట్ లో మరోసారి మాస్ బ్యాటింగ్ షురూ!

నాని స్టార్ పవర్..యూఎస్ మార్కెట్ లో మరోసారి మాస్ బ్యాటింగ్ షురూ!

Published on Sep 9, 2026 10:07 AM IST

నాచురల్ స్టార్ నానికి బలమైన మార్కెట్ లలో యూఎస్ మార్కెట్ కూడా ఒకటి. మన దగ్గర కొంచెం అటు ఇటు అయ్యిన సినిమాలు కూడా ఒక్క 1 మిలియన్ డాలర్ గ్రాస్ మార్కుని దాటాయి. ఆ రేంజ్ మార్కెట్ ని నాని అక్కడ సొంతం చేసుకున్నాడు. ఇక ఇలాంటి స్టార్ పవర్ ఉన్న నాని నుంచి ఓ భారీ సినిమా వస్తుంది అంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తన సినిమా ది ప్యారడైజ్ చూపిస్తుంది.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా తాలూకా యూఎస్ మార్కెట్ బుకింగ్స్ అక్కడ మొదలు కావడం ఆలస్యం హాట్ కేకుల్లా అక్కడ టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. చాలా తక్కువ సమయంలోనే సినిమా లక్ష డాలర్లు మార్క్ దాటేసి సెన్సేషన్ ని సెట్ చేసింది. దీనితో రిలీజ్ నాటికి ప్యారడైజ్ ఓ రేంజ్ ఓపెనింగ్స్ సాధించడం అయితే పక్కా అని ఇప్పుడు ఖరారు అయ్యిపోయింది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ సెప్టెంబర్ 24న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

తాజా వార్తలు