ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కాకా కోసం అందరికీ తెలిసిందే. చిరు కెరీర్ 158వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్ల మంచి హైప్ సెట్ అయ్యింది. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకెళ్తుండగా సంగీత దర్శకుడు థమన్ కాకా సెట్స్ నుంచి ఓ బ్యూటిఫుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నాడు.
ఇద్దరూ ఎంతో ఆనందంగా నవ్వుతూ ఇందులో కనిపిస్తున్నారు. దీనితో ఈ పిక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక అంతే కాకుండా కాకా మ్యూజిక్ పై కూడా థమన్ సాలిడ్ ప్రామిస్ చేస్తున్నాడు. తన బెస్ట్ ఎవర్ వర్క్ ని అందిస్తున్నట్టుగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను అని థమన్ తెలిపాడు. ఆల్రెడీ మెగాస్టార్ కి బ్రూస్ లీ ఇంకా గాడ్ ఫాథర్ వంటి సినిమాలకి థమన్ ఇచ్చిన స్కోర్ కి మంచి ఫీడ్ బ్యాక్ ఉంది. సో ఈసారి తన వర్క్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.


