ఇంటర్వ్యూ : హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ – ‘సీక్రెట్ సోల్జర్’లో స్నేహంతో పాటు దేశభక్తి కూడా..!

ఇంటర్వ్యూ : హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ – ‘సీక్రెట్ సోల్జర్’లో స్నేహంతో పాటు దేశభక్తి కూడా..!

Published on Sep 12, 2026 7:00 PM IST

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. అక్కి విశ్వనాథ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందించగా, ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ మూవీ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘చైనా పీస్’గా మొదలైన ప్రయాణం ‘సీక్రెట్ సోల్జర్’గా ఎలా మారింది?

‘చైనా పీస్’ పేరుతో ప్రచారం చేసినా, సెన్సార్‌ మరియు విదేశాంగ శాఖల అభ్యంతరాల వల్ల టైటిల్‌ను ‘సీక్రెట్ సోల్జర్’గా మార్చాం. 8 నెలల సెన్సార్ ప్రక్రియలో కేవలం కొన్ని చిన్న విజువల్ కట్స్ మాత్రమే పడ్డాయి తప్ప, దర్శకుడు విశ్వనాథ్ కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.

ఇందులో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుంది?

ఈ సినిమా పక్కా స్పై డ్రామాగా తెరకెక్కింది. ముఖ్యంగా ఇందులో వచ్చే స్పై యాక్షన్ సీన్స్ ఎంతో రియలిస్టిక్‌గా, ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయి.

ఈ కథ ఏమిటి?

భారత్‌కు చెందిన కీలక సమాచారం లీక్ కావడం, దానికి నెల్లూరులోని ఇద్దరు సాధారణ కుర్రాళ్లకు ఉన్న లింక్ ఏంటనే ఆసక్తికర అంశంతో స్నేహం, దేశభక్తి కలగలిసిన ఒక కొత్త ఎమోషనల్ స్పై డ్రామాగా ఈ సినిమా రాబోతోంది.

స్పై డ్రామాలో ఇది ఎంత కొత్తగా ఉంటుంది?

మన మధ్యనే సాధారణంగా ఉండే గూఢచారుల సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ, ఇద్దరి స్నేహం మరియు వారి ప్రయాణాన్ని దర్శకుడు అత్యంత కొత్తగా ఆవిష్కరించారు.

సినిమా ఎవరికైనా చూపించారా?

డిస్ట్రిబ్యూటర్లు, సాధారణ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. పరిశ్రమ వర్గాలు సైతం ఇది ‘పెద్ద స్టార్స్ చేయాల్సిన సినిమా’ అని ప్రశంసించడం చిత్ర బృందానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కమల్ కామరాజు, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖ నటీనటుల యూనిక్ పాత్రలతో పాటు, తగినంత సమయం తీసుకుని గ్రాండ్ వీఎఫ్‌ఎక్స్, అత్యుత్తమ క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీ కొత్త సినిమాల గురించి?

నిహాల్: ఈటీవీతో ఒక సినిమా చేస్తున్నాను. సాయిరాజేష్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాను .
సూర్య శ్రీనివాస్: నేను బైలింగ్వల్ సినిమా చేస్తున్నాను. అంతా రాములోరు చూసుకుంటారు లో ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నాను. ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు