న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన ప్రెస్టీజియస్ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యావత్ చిత్ర యూనిట్ పూర్తిగా నిమగ్నమై ఉంది.
ఈ చిత్రం ఈ నెల 23న పెయిడ్ ప్రిమియర్స్, 24న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రదర్శనకు కేవలం వారం రోజులే సమయం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్, ప్యాచ్ వర్క్ పనుల్లో యూనిట్ బిజీగా మారింది. దర్శకుడు శ్రీకాంత్ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలిసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో ఉండటంతో, హీరో నాని స్వయంగా పోస్ట్ ప్రొడక్షన్ డెలివరీలను పర్యవేక్షిస్తున్నాడు.
అయితే ఈ సినిమాకి ఎలాంటి ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని చిత్రయూనిట్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఒత్తిడి వల్ల పూర్తి స్థాయి ప్రమోషన్లు కష్టమైనప్పటికీ, డిజిటల్ ప్రమోషన్లతో పాటు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పైనే నాని ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. నాని ఒకవైపు అవుట్‌పుట్ వర్క్స్ చూసుకుంటూనే, మరోవైపు ప్రమోషన్లను ఎలా హ్యాండిల్ చేస్తాడో మరియు ఈ లిమిటెడ్ ప్రమోషన్స్ ప్లాన్ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.


