‘ది ప్యారడైజ్’ తెలుగు స్టేట్స్ ప్రీమియర్లు.. టికెట్ ధరలపై ఇంట్రెస్టింగ్ బజ్!

‘ది ప్యారడైజ్’ తెలుగు స్టేట్స్ ప్రీమియర్లు.. టికెట్ ధరలపై ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Sep 15, 2026 8:55 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ చిత్రమే ది ప్యారడైజ్. టాలీవుడ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది కాగా పాన్ ఇండియా నుంచి రీజనల్ రిలీజ్ గా ఇపుడు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకి ముందే వేసే ప్రీమియర్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తోంది.

అయితే ప్యారడైజ్ చిత్రానికి ప్రీమియర్స్ అయితే ఖచ్చితంగా పడతాయట. కానీ టికెట్ ధరల విషయంలోనే ఇప్పుడు అసలు చిక్కుముడి ఉందట. మేకర్స్ కేవలం ప్రీమియర్స్ టికెట్ ధరల హైక్ తెచ్చుకొని ఇక మిగతా రోజులు అంతా సాధారణ టికెట్ ధరలు తో సినిమా రన్ చెయ్యాలా లేక ప్రీమియర్స్ నుంచే సాధారణ టికెట్ ధరలతో సినిమా విడుదల చేయాలా అనే సంశయంలో ఉన్నట్టు టాక్.

అలాగే నైజాం మార్కెట్ లో ప్రీమియర్స్ టికెట్ హైక్ కోసం ఆల్రెడీ అర్జీ కూడా పెట్టారని మరో రూమర్ వినిపిస్తోంది. సో దాదాపు అదనపు టికెట్ ధరలు భారీగా లేకపోయినా కొంచెం అయితే ఉండొచ్చు అని టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు