ట్విస్ట్: ‘హనుమాన్ అంశ’ తెలుగు రిలీజ్ వాయిదా? కారణమిదేనా?

ట్విస్ట్: ‘హనుమాన్ అంశ’ తెలుగు రిలీజ్ వాయిదా? కారణమిదేనా?

Published on Sep 16, 2026 11:05 AM IST

ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర సంచలన విజయం సాధించిన చిత్రమే హనుమాన్ అంశ. దర్శకుడు దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ డివోషనల్ డ్రామా భారీ వసూళ్లు ఇప్పటికీ కొనసాగిస్తూ సంచలన రన్ తో దూసుకెళ్తుంది.

అయితే ఈ సినిమాని తెలుగులో హనుమాన్ అవతారం గా విడుదల చేసేందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముందుకు వచ్చారు. ఈ సెప్టెంబర్ 18 డేట్ కూడా లాక్ చేశారు కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ వినిపిస్తోంది. దీనికి కారణం త్రివిక్రమ్ తప్పుకోవడమే అన్నట్టుగా ఊహించని విషయం బయటకి వచ్చింది.

అందుకే సినిమా వాయిదా అన్నట్టుగా టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం ఈ సినిమాని తెలుగులో చూడాలి అనుకున్న వారికి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకు రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు