అడివి శేష్ ‘G2’ రిలీజ్ డేట్ ఖరారు.. ఫిబ్రవరి 5న థియేటర్లలోకి స్పై థ్రిల్లర్!

అడివి శేష్ ‘G2’ రిలీజ్ డేట్ ఖరారు.. ఫిబ్రవరి 5న థియేటర్లలోకి స్పై థ్రిల్లర్!

Published on Sep 16, 2026 2:00 PM IST

టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘G2’ (#G2) విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా భారీ ప్రాజెక్ట్‌ను ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర యూనిట్‌కు సన్నిహిత వర్గాల నుంచి ఈ సమాచారం బయటకు వచ్చింది.

ఫిబ్రవరి 5న గ్రాండ్ ఎంట్రీ

ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి డేట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే చిత్ర బృందం నుంచి విడుదల తేదీకి సంబంధించి అధికారిక పోస్టర్ రానుంది.

వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, వామికా గబ్బి, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు