న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో నయా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా నార్త్ అమెరికా ప్రీమియర్ షో ప్రీ-సేల్స్ ఇప్పటికే 300K డాలర్ల మార్కును దాటేయడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ స్పందన వ్యక్తమవుతోంది.
నార్త్ అమెరికా వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ అయిన అతి తక్కువ సమయంలోనే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఓవర్సీస్‌లో నానికి ఉన్న బలమైన మార్కెట్‌కి, శ్రీకాంత్ ఓదెల మాస్ టేకింగ్ తోడవ్వడంతో ఈ విధ్వంసకర రెస్పాన్స్ కనిపిస్తోంది. బుకింగ్స్ మరింత విస్తృతం కానుండటంతో, ప్రీమియర్ షోల సమయానికి ఈ చిత్రం ప్రీ-సేల్స్ విభాగంలో మరిన్ని సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.


