వర్సెటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఈసారి సరికొత్త వైల్డ్ అవతార్‌లో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సమవర్తి’కి సంబంధించిన సాలిడ్ అప్‌డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
విల్లు పట్టిన పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ లుక్‌తో ఉన్న పోస్టర్‌ను షేర్ చేస్తూ, ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అజయ్ నాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రుద్ర పిక్చర్స్ మరియు పంచభూత ఫిలింస్ బ్యానర్లపై జక్కిడి శివారెడ్డి, శశిధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, రవీంద్ర విజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
సత్యదేవ్ కెరీర్‌లోనే అత్యంత వైల్డ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్‌గా రాబోతున్న ఈ ‘సమవర్తి’ టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తున్నాడు.


