ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ క్లూ.. నెక్స్ట్ లెవెల్ అంతే..!

ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ క్లూ.. నెక్స్ట్ లెవెల్ అంతే..!

Published on Sep 18, 2026 5:56 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచాయి. అయితే, ఈ సినిమా నుంచి మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

‘ఆదర్శ కుటుంబం’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్‌పై ఓ క్లూ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ త్వరలోనే రానుందని.. ఇది పూర్తిగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండనుందని ఆయన తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.

దీంతో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలోని ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో వెంకీ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు