శ్రీ నందు హీరోగా ‘మగాళ్లు జిందాబాద్’.. టైటిల్ ప్రకటన

శ్రీ నందు హీరోగా ‘మగాళ్లు జిందాబాద్’.. టైటిల్ ప్రకటన

Published on Sep 18, 2026 8:00 AM IST

గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ పతాకంపై శ్రీ నందు హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రానికి ‘మగాళ్లు జిందాబాద్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నార ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ టైటిల్ ప్రకటన కార్యక్రమాన్ని నిర్వహించింది.

​సమాజంలో పురుషులు ఎదుర్కొనే సమస్యలను నేపథ్యంగా తీసుకుని, వినోదాత్మకంగా ఈ కథను రూపొందించామని దర్శకుడు నార ప్రవీణ్ తెలిపారు. ఇది వ్యంగ్యాస్త్రాలతో సాగే సామాజిక హాస్య చిత్రమని ఆయన వివరించారు. లక్ష్మీ దుర్గ, అక్షర గౌడ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు.

​మగవారి ఆలోచనలు, బాధ్యతలు, వారు నిత్యజీవితంలో పడే ఇబ్బందులను హాస్యభరితంగా చూపిస్తూనే కుటుంబమంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని హీరో శ్రీ నందు చెప్పారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు.

​ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, మదిన్ ఎస్.కె సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ కళ్యాణి ఛాయాగ్రాహకుడిగా, శ్రీధర్ సోంపల్లి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాతలు ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు