ఆశిష్ గాంధీ ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్ విడుదల.. అక్టోబర్‌లో సినిమా రిలీజ్

ఆశిష్ గాంధీ ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్ విడుదల.. అక్టోబర్‌లో సినిమా రిలీజ్

Published on Sep 18, 2026 8:00 AM IST

ఆశిష్ గాంధీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డానీ’ నుంచి మేకర్స్ ఫస్ట్ స్ట్రైక్‌ను విడుదల చేశారు. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహిస్తున్నారు.

​యాక్షన్, రొమాన్స్ అంశాలతో కూడిన సన్నివేశాలతో ఈ ఫస్ట్ స్ట్రైక్ వీడియోను రూపొందించారు. గతంలో కళ్యాణ్‌జీ గోగణ, ఆశిష్ గాంధీ కలయికలో ‘నాటకం’, ‘కళింగ’ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

​ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, ఏకే ఆనంద్ సినిమాటోగ్రాఫర్‌గా, మణికాంత్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కొల్లి గోపాల కృష్ణ సమర్పిస్తున్న ఈ సినిమాకు ఖుషి సహ నిర్మాత. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు