‘దాదా’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయిందా?

‘దాదా’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయిందా?

Published on Sep 20, 2026 9:55 PM IST

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనితో భారీ చిత్రం ‘దాదా’ చేస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న ఈ స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుంది.

అయితే ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య అంటే సాలిడ్ మ్యూజిక్ ఇచ్చే థమన్ లేటెస్ట్ గా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ సెప్టెంబర్ 24న వస్తుంది అన్నట్టుగా ఇచ్చిన స్టేట్మెంట్ కొంచెం ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది. లేటెస్ట్ ఓ యూత్ ఇంట్రాక్షన్ లో థమన్ ఈ విషయం తెలిపాడు.

అలాగే బాలయ్య, కాజల్ పై ఓ సాంగ్ ని న్యూజిలాండ్ లో షూట్ చేయడానికి వెళుతున్నట్టు తెలిపాడు. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 24న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు