‘ప్యారడైజ్’ ప్రీమియర్స్: తెలుగు స్టేట్స్ లో ఇందుకే ఇంకా మొదలు కాలేదా!

‘ప్యారడైజ్’ ప్రీమియర్స్: తెలుగు స్టేట్స్ లో ఇందుకే ఇంకా మొదలు కాలేదా!

Published on Sep 22, 2026 1:00 PM IST

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఒకరోజు ముందు ప్రీమియర్స్ తోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే.

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 23 సాయంత్రం లేదా రాత్రి నుంచే షోస్ మొదలు కానున్నాయి. అయితే సమయం దగ్గరకు వస్తుంది కానీ సినిమా ప్రీమియర్స్ తాలూకా బుకింగ్స్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. రేటు ఎక్కువ అయినా పర్లేదు ముందే షో చూడాలని తాపత్రపడుతున్న ఆడియెన్స్ ఈ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ బుకింగ్స్ ఎందుకు ఓపెన్ కాలేదు అనేది తెలుస్తుంది. గతంలో పలు సినిమాలు ఇలా ప్రీమియర్స్ ప్లాన్ చేసుకొని తీరా కంటెంట్ ఆలస్యం అయ్యి లేటుగా ప్రీమియర్స్ వేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే అలాంటి మిస్టేక్స్ జరగకుండా కంటెంట్ ప్రీమియర్ షోస్ కి కూడా అందిన తర్వాత ప్యారడైజ్ బుకింగ్స్ మొదలు కానున్నాయి అని తెలుస్తుంది. సో దీనితో ఎంత సమయం పడుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇపుడు నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు