సత్య ధనేకుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్ కాళికా మిస్సింగ్’ నిర్మాణానంతర (పోస్ట్ ప్రొడక్షన్) పనులను పూర్తి చేసుకుంది. జేఎస్వీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకాలపై రామకృష్ణ, పదిమల యమున సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాను అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ కథనం, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని వారు పేర్కొన్నారు.
వినీత్ చంద్ర, డాలీషా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఎస్తేర్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, ఆలీ, జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శివ దేవరకొండ ఛాయాగ్రాహకుడిగా, లీండర్ లీ మార్టీ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


