ఆ ఏరియాల్లో నాని ర్యాంపేజ్.. ‘ది ప్యారడైజ్’తో బెస్ట్ ఓపెనింగ్స్..!

ఆ ఏరియాల్లో నాని ర్యాంపేజ్.. ‘ది ప్యారడైజ్’తో బెస్ట్ ఓపెనింగ్స్..!

Published on Sep 23, 2026 8:59 PM IST

న్యాచురల్ స్టార్ నాని తమిళ ప్రేక్షకుల్లో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాతోనూ తమిళనాడులో ఆయన తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ చిత్రానికి సంబంధించి చెన్నైలో బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రీమియర్లతో కలిపి ఈ సినిమా అక్కడ ఇప్పటికే రూ.1 కోటి మార్కును దాటేసింది. నాని కెరీర్‌లోనే ఇది అతిపెద్ద చెన్నై ఓపెనింగ్‌గా నిలిచింది.

అటు కర్ణాటకలోనూ ఈ సినిమాకు ఇదే స్థాయి స్పందన లభిస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే (ప్రీమియర్లతో కలిపి) రూ.3.25 కోట్ల వసూళ్లను సాధించి, ఈ ప్రాంతంలో కూడా నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. గ్లోబల్‌గా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్లతో మీడియం రేంజ్ హీరోల చిత్రాల్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘ది ప్యారడైజ్’ అవతరించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు