‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల – న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ రెస్పాన్స్ అందుకుంది. నిన్న ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్ల నుంచే ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ ప్రారంభమైంది. బలహీనమైన కథనం, మితిమీరిన హింస, సెకండాఫ్‌లో కంటిన్యూటీ లోపించడంపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విడుదలకు ముందు శ్రీకాంత్ ఓదెల మేకింగ్‌పై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు, ఇప్పుడు ఆయన పూర్ రైటింగ్, ఎగ్జిక్యూషన్ విధానంపై ట్రోల్స్ చేస్తున్నారు. పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ జరపడం వల్లే ఎడిటింగ్‌లో చాలా భాగం వేస్ట్ అయిందని, దీనివల్ల చిత్ర బడ్జెట్ పెరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్లలో ఎంతో కాన్ఫిడెన్స్‌గా కనిపించిన చిత్రబృందం, విడుదల తర్వాత వచ్చిన ఈ విమర్శలపై ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. మరి ఈ మిక్సిడ్ ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరిస్తూ శ్రీకాంత్ ఓదెల రెస్పాండ్ అవుతాడేమో చూడాలి.


