సమీక్ష : ది వన్ – సహనాన్ని పరీక్షించే మిస్టరీ థ్రిల్లర్

సమీక్ష : ది వన్ – సహనాన్ని పరీక్షించే మిస్టరీ థ్రిల్లర్

Published on Sep 25, 2026 6:04 PM IST

విడుదల తేదీ : సెప్టెంబర్ 25, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా, సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని తదితరులు
దర్శకత్వం : దీపక్ కుమార్ మిశ్రా
నిర్మాతలు: శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అరుణభ్ కుమార్, నీరజ్ కొఠారి
సంగీతం : విశాల్ మిశ్రా, అమిత్ త్రివేది, తనిష్క్ బాగ్చీ, సామ్ సి.ఎస్
ఛాయాగ్రహణం : మను ఆనంద్
కూర్పు : నితిన్ బైద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ద వన్’ మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

దేవాంచల్ ప్రాంతంలోని ఒక దట్టమైన అడవి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సూర్యాస్తమయం తర్వాత ఆ అడవిలోకి వెళ్తే ‘వన్ దేవి’కి ఆగ్రహం వచ్చి ప్రాణాలు పోతాయని ఆ ఊరి ప్రజలు బలంగా నమ్ముతారు. దేవాంచల్‌కి చెందిన రిషి(సిద్ధార్థ్ మల్హోత్రా) ముంబైలో ఇంజనీర్‌గా పనిచేస్తూ, తన భార్య మమత(తమన్నా భాటియా)తో కలిసి నివసిస్తుంటాడు. రిషికి తన సొంత ఊరికి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ, అడవిలో ఉన్న పూర్వీకుల ఆస్తికి సంబంధించిన పనుల నిమిత్తం తమ్ముడు పంపిన పిలుపు మేరకు దేవాంచల్‌కు రావాల్సి వస్తుంది. ఆ తర్వాత రిషి ఆ అడవి చుట్టూ ఉన్న రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేదే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నాలు తమ తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు. ‘ఛఠీ మాయా’ పాటలో తమన్నా ప్రెజెన్స్ బాగుంది. ప్రారంభంలో రాజు పాత్రకు సంబంధించిన కొన్ని సీన్స్ కొంతవరకు ఆసక్తిని కలిగిస్తాయి.

ఫస్ట్ హాఫ్‌లో మనీష్ పాల్ తన టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. సునీల్ గ్రోవర్ కూడా తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, బలహీనమైన కథనం వల్ల తన ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరైంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మేకింగ్ పక్కన పెడితే, అసలు కథాంశంలోనే ఎలాంటి ఆసక్తికర అంశం లేదు. కథ ఎంత నీరసంగా ఉందంటే, అసలు ఈ ప్రాజెక్ట్‌ను ఎలా ఓకే చేశారో అర్థం కాక ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. కథలోనే మేటర్ లేనప్పుడు, స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా నడిపించడం మరింత కష్టమైపోయింది. ఒక మిస్టరీ థ్రిల్లర్‌కు ఉండాల్సిన గూస్‌బంప్స్ లేదా హారర్ ఎలిమెంట్స్ ఎక్కడా కనిపించవు. కమర్షియల్ అంశాల పేరుతో పెట్టిన అనవసరపు సీన్స్ సినిమాలోని మెయిన్ మిస్టరీని పక్కదారి పట్టిస్తాయి.

విలన్‌కు సంబంధించిన మెయిన్ ట్విస్ట్ అస్సలు వర్కవుట్ కాలేదు. ఇలాంటి కాన్సెప్ట్‌లు గతంలో చాలా సినిమాల్లో చూసేశాం. కథలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి డివోషనల్ అంశాలను వాడుకున్నట్లు అనిపిస్తుంది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా నత్తనడకన సాగుతూ ప్రేక్షకుడి ఓపికకు తీవ్ర పరీక్ష పెడుతుంది. సీరియస్ సీన్స్ మధ్యలో బలవంతంగా కామెడీని ఇరికించినట్లు అనిపిస్తుంది. బ్యాక్‌స్టోరీ చెప్పడానికి AI ని ఉపయోగించిన విధానం మరింత విసుగుతెప్పించేలా చేస్తుంది. క్లైమాక్స్ కూడా అనవసరంగా సాగదీశారు.

సాంకేతిక విభాగం :

పాపులర్ అయిన ‘ఛఠీ మాయా’ పాట వెండితెరపై చూడటానికి బాగుంది. ‘తుమక్ తుమక్’ పాట వినడానికి బాగున్నా, సినిమాలో దాని ప్లేస్‌మెంట్ చాలా దారుణంగా ఉంది. మను ఆనంద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. అయితే ఎడిటింగ్, బీజీఎం మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. వీఎఫ్ఎక్స్ పనులు చాలా వీక్‌గా ఉన్నాయి. దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా మేకింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. కేవలం డివోషనల్ అంశాలపై ఆధారపడి, కథ, కథనాలను గాలికి వదిలేస్తే సినిమా ఆడుతుందనుకోవడం పొరపాటు.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే.. ‘ది వన్’ అనే ఈ చిత్రం చాలా నిరసంగా, విసుగు తెప్పించేలా సాగే ఒక వీక్ మిస్టరీ థ్రిల్లర్‌గా నిలిచింది. బలహీనమైన కథను డివోషనల్ అంశాల వెనుక దాచేసే ప్రయత్నం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల అసలు మిస్టరీ అంశమే గాలికి కొట్టుకుపోయింది. థ్రిల్స్ లేని కథనం, విసుగు తెప్పించే సెకండ్ హాఫ్‌తో సాగే ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు