న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ స్టార్ట్ అందుకుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు, ఫస్డ్ డే ఫస్ట్ షో నుంచే మిక్సి్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయినా కూడా జనం ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎంజాయ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ చిత్రానికి ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో ఓపెనింగ్ రోజు ఏకంగా 2.3 మిలియన్ డాలర్స్‌తో దుమ్ములేపింది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా ‘ది ప్యారడైజ్’ రికార్డు క్రియేట్ చేసింది. ఊరమాస్ అవతారంతో నాని ఓవర్సీస్‌లో చేస్తున్న ర్యాంపేజ్ మామూలుగా లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
కయాదు లోహర్ హీరోయిన్‌గా మోహన్ బాబు, రాఘవ్ జుయల్ విలన్‌లుగా నటించిన ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, సోనాలి కుల్కర్ణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.



