
తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేయగల అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ప్రియమణి కూడా చేరిపోయింది. తాజాగా ప్రియమణి డబుల్ రోల్ చేసిన చారులత సినిమాలో నటనకి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు ని కూడా అందుకుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తను ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చేయాలనుకోవటం లేదని తెలిపింది. ‘ నేను ఒకే రకమైన పాత్రలకి పరిమితమవ్వాలని అనుకోవటం లేదు. చారులత సినిమా తర్వాత అలాంటి కథలే నాదగ్గరికి చాలా వచ్చాయి. కానీ నేను వాటిని అంగీకరించలేదు. నేను అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేయడానికి నేను సిద్దమే’ అని ప్రియమణి తెలిపింది. ప్రస్తుతం ప్రియమణి ‘చండి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కృష్ణం రాజు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే త్వరలో విడుదల కానున్న షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుంది. వీటన్నిటితో మాటు మలయాళంలో ది ట్రూ స్టొరీ అనే సినిమాలో నటిస్తోంది.
ఒకే రకమైన పాత్రలకు పరిమితం కానంటున్న ప్రియమణి
ఒకే రకమైన పాత్రలకు పరిమితం కానంటున్న ప్రియమణి
Published on Jul 28, 2013 6:00 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ డబుల్ ట్రీట్ గ్యారెంటీనా..?
- ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ లాంచ్‌కు టైమ్ ఫిక్స్..!
- టాక్సిక్ ట్రోలింగ్స్ : యష్‌కు ఇంకా ఆ హ్యాంగోవర్లోనే ఉన్నాడా..?
- పిక్ టాక్ : ‘మనం ఊగుదమే బాలా’ అంటూ హైప్ పెంచేస్తున్న జడల్..!
- చేతులు కలుపుతున్న తమిళ స్టార్ డైరెక్టర్స్.. ఎవరంటే..?
- జి.వి.నారాయణ రావు మృతిపై మెగాస్టార్ సంతాపం
- ది ప్యారడైజ్ : వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది.. హైప్ పెంచుతున్న కీర్తి సురేష్..!
- కన్ఫర్మ్ : ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ సాంగ్ అదే.. స్పీకర్స్‌ను బద్దలుకొట్టేందుకు సిద్ధమైన అనిరుధ్..!
- దసరా సీజన్లో మారనున్న రిలీజ్ డేట్స్.. లెక్కలు కూడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- 2026 కంబ్యాక్ నామ సంవత్సరం: వరుస హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకి పాపులర్ స్టార్స్
- హౌస్‌ఫుల్ షోలతో యశ్ ‘టాక్సిక్’ !
- డిజాస్టర్ ‘పంజా’ మేనియా మరోసారి షురూ.. 4 షోస్ తోనే ట్రెండింగ్ బుకింగ్స్!
- ‘ఇరుముడి’ పై ‘పెద్ది’ రామ్ చరణ్ రెస్పాన్స్ వైరల్!
- షాకింగ్ : ‘స్పిరిట్’కు A సర్టిఫికెట్ ఖాయమని తేల్చిన సందీప్ రెడ్డి వంగా
- రేపటి నుంచి స్టార్ట్ కానున్న ‘జార్జ్ క్రిష్’ !
- అభిమానులకు ‘టాక్సిక్’ నిర్మాతలు ప్రత్యేక విజ్ఞప్తి !

