
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆగడు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మధ్య హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద జరిగిన షూటింగ్ లో మహేష్ బాబు నాలుగు రోజుల పాటు పాల్గొన్నాడు. ప్రస్తుతం బ్రహ్మానందం, మరికొంత మంది కామెడీ నటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ బాబుతో ఆయన తీస్తున్న రెండవ సినిమా ఇది. శ్రీనువైట్ల తీసిన గత సినిమాలను బట్టి చూస్తే ఈ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ శాతం ఉండవచ్చునని బావిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ బాబు మరొకసారి పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మొదటి సారిగా తమన్నా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో జనవరి 15 నుండి పాల్గొంటాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు.
‘ఆగడు’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బ్రహ్మానందం
‘ఆగడు’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బ్రహ్మానందం
Published on Dec 31, 2013 6:56 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : బైకర్
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- లేటెస్ట్ యూత్‌ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
- ‘డెకాయిట్’ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..?
- ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ : రామాయణం నుంచి పురుషోత్తముడి దర్శనం..!
- పోల్ : ‘రామాయణ’ నుండి రామ ఫస్ట్ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- మరోసారి మైత్రీ తో చేతులు కలుపుతున్న ప్రదీప్ రంగనాథన్..!
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?
- పెయిడ్ ప్రీమియర్స్‌కు సిద్ధమైన ‘రాకాస’.. ఎప్పుడంటే..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
- టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK

