ఇంటర్వ్యూ : డైరెక్టర్ అభిలాష్ రెడ్డి – ‘బైకర్’ 100% సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది..!

Abhilash Reddy

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బైకర్’ ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. అభిలాష్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనుంది. ఈ సినిమాను డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై సాలిడ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘బైకర్’ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది?

డాల్బీ విజన్ టెక్నాలజీ మరియు అద్భుతమైన సౌండ్ డిజైన్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రేక్షకులకు 100% సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతోంది.

ఈ సినిమా కథ రాయడానికి ఇన్స్పిరేషన్?

బైక్ అనేది ప్రతి ఒక్కరికీ ఒక ఎమోషన్ కాబట్టి, ఆ పాయింట్‌కి రేసింగ్‌తో పాటు తండ్రీకొడుకుల మధ్య ఉండే హృదయానికి హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి ఈ కథను రూపొందించాం.

షూటింగ్ సమయంలో మీరు ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు ఏమిటి?

రియల్ రేసర్లతో యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించినప్పుడు అనేక ప్రమాదాలు జరగడం వల్ల షూటింగ్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి. అందుకే కేవలం యాక్షన్ పార్ట్ కోసమే 60 రోజులకు పైగా సమయం పట్టింది.

‘ఎఫ్ వన్’ (F1) సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి కొత్తదనాన్ని అందిస్తుంది?

‘ఎఫ్ వన్’ విడుదలకు ముందే ఈ చిత్ర షూటింగ్ పూర్తయినప్పటికీ, అందులోని కథతో పోలిస్తే ఇందులో ఉండే ఎమోషన్ మరియు డ్రామా పూర్తిగా భిన్నంగా, కొత్తగా ఉంటాయి.

ఈ సినిమా కోసం శర్వానంద్ గారు చేసిన మేకోవర్ మరియు ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి?

ఈ పాత్ర కోసం శర్వానంద్ సుమారు 23 కిలోల బరువు తగ్గడమే కాకుండా, 6 నెలల పాటు విరామం తీసుకుని ఫిజికల్ అండ్ మెంటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను అందించారు.

ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ గారి స్పందన ఏమిటి?

ప్రభాస్ గారు వంశీ గారితో ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పడమే కాకుండా, సినిమా గురించి ట్వీట్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది.

ఈ సినిమాకు జిబ్రాన్ అందించిన సంగీతం ఎలా ఉండబోతోంది?

జిబ్రాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు, ముఖ్యంగా చివరి 40 నిమిషాల సౌండ్ ట్రాక్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

సినిమా చూసిన తర్వాత దిల్ రాజు గారి స్పందన ఏమిటి?

దిల్ రాజు గారికి సినిమా చాలా నచ్చిందని, మేకింగ్ బాగుందని మెచ్చుకున్నారు. అంతేగాక, తమ బ్యానర్‌లో నెక్స్ట్ చిత్రాన్ని కూడా చేసే అవకాశం ఇచ్చారు.

Exit mobile version