ఇంటర్వ్యూ : ఎస్.దర్శన్ – ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఒక గుడ్ ఎంటర్ టైనర్. !

Published on Aug 22, 2021 6:10 pm IST

యంగ్ హీరో సుశాంత్ హీరోగా ఎస్.దర్శన్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ చిత్రం ద్వారా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటిస్తున్నారు. అయితే రిలీజ్ కి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఎస్.దర్శన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కథ గురించి ?

ఈ సినిమా కథ ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. 2010లో నాకు, నా ఫ్రెండ్ కి చెన్నైలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా 2013లో ఈ సినిమా కథ రాశాను.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది ?

ఇది బేసిగ్గా థ్రిల్లర్ అయినప్పటికీ.. సినిమాలో అన్నీ ఎమోషన్స్ ను మెయింటైన్ చేస్తూ ఈ సినిమా చేయడం జరిగింది. కామెడీ కూడా సినిమాలో హైలైట్ అవ్వనుంది.

మీ సినీ నేపథ్యం గురించి చెప్పండి ?

నాది తమిళనాడు అండి. నేను దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి సర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. శ్రీనివాస్ రెడ్డిగారి ఢమరుకం సినిమా చేస్తోన్న సమయంలోనే నేను తెలుగు కూడా నేర్చుకున్నాను.

తమిళంలో చాలా మంచి దర్శకులు ఉన్నారు కదా, మరి శ్రీనివాస్ రెడ్డి దగ్గరే అసిస్టెంట్ గా పని చేయడానికి రీజన్ ఏమిటి ?

మా నాన్నగారు ఒక తమిళ సినిమా రైటర్ అండి. శ్రీనివాస్ రెడ్డిగారి యమగోల సినిమాకి కూడా ఆయన పని చేశారు. అలా అనుకోకుండా నేను శ్రీనివాస్ రెడ్డిగారి దగ్గర జాయిన్ అయ్యాను.

సినిమాలో సుశాంత్ పాత్ర గురించి చెప్పండి ?

ఈ సినిమాలో సుశాంత్ గారు ఒక ఆర్కిటెక్టర్ అండి. పక్కింటి అబ్బాయి లాంటి పాత్ర ఆయనది. ఒక నార్మల్ గా ఉండే పాత్రకు ఒక బ్యాడ్ సంఘటన ఎదురైతే ఏమి చేస్తాడు ? అనే కోణంలో ఆయన పాత్ర సాగుతుంది.

‘యూటర్న్’ సినిమా జోనర్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇందులో ఎంత నిజం ఉంది ?

ఏ మాత్రం నిజం లేదు అండి. ఆ సినిమాకి ఈ సినిమా పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది.

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీమ్ గురించి /

చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు అండి. నాది తమిళ నాడు కావడం వల్ల తెలుగులో నాకు అంత గ్రిప్ లేదు. కానీ నటీనటుల సెలెక్షన్ దగ్గర నుండి ప్రతి విషయంలో నాకు టీమ్ బాగా సపోర్ట్ చేశారు.

ప్రేక్షకులు ఏమి ఆశించి మీ సినిమాకి రమ్మంటారు ?

ఇది గుడ్ ఎంటర్ టైనర్. చిన్న చిన్న విషయాలను వదిలేస్తూ ఉంటాం. ఉదాహరణకు నో పార్కింగ్ లాంటివి. అవి కూడా ఒక్కోసారి కొంతమందికి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అలాంటి అంశాలను కూడా సినిమాలో ఇంట్రెస్ట్ వేలో చూపించబోతున్నాము.

సంబంధిత సమాచారం :