ఇంటర్వ్యూ: డైరెక్టర్ మారుతి – ‘ప్రతిరోజు పండగే’ ఎనభై శాతం చిత్రీకరణ పూర్తయింది !

ఇంటర్వ్యూ: డైరెక్టర్ మారుతి – ‘ప్రతిరోజు పండగే’ ఎనభై శాతం చిత్రీకరణ పూర్తయింది !

Published on Oct 7, 2019 5:03 PM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ప్రతిరోజు పండగే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూలో…

 

‘ఈ రోజుల్లో’తో దర్శకుడిగా మీ ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది ?

 

నేను డైరెక్టర్ అవ్వాలి అనే కోరిక ఈ రోజుల్లో చిత్రం తీర్చింది. నేను ఒక సినిమా డైరెక్ట్ చెయ్యగలని ఫ్రెండ్స్ కు చూపించడానికి ఈ రోజుల్లో తీశాను, అది పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా మంది నిర్మాతలు సినిమాలు చెయ్యమని అడిగారు, అలా వరుగగా సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పటివరకైతే అంతా బాగానే అనిపిస్తోంది.

 

‘ప్రతిరోజు పండగే’ చిత్రం మీ సినిమాలకు భిన్నంగా ఉంటుందా ?

 

సమాజంలో జరుగుతున్న అంశాలను తీసుకొని నా తరహాలో దానికి ఎంటర్త్సైన్మెంట్ జోడించి సినిమాలు తీశాను, సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న ప్రతిరోజు పండగే లో ఎమోషన్స్ తో పాటు ఎంటర్త్సైన్మెంట్ ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ కు ముందు ఈ కథ లైన్ చెప్పాను. నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ వినిపించాను. సాయి కెరీర్ లో ఇది డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ సబ్జెక్ట్ ఇది.

 

ప్రతిరోజు పండగే చిత్రాన్ని ‘గీత ఆర్ట్స్ 2’లో చేయడానికి కారణం ?

 

ముందుగా ప్రతిరోజు పండగే కథను యు.వి.క్రియేషన్స్ వంశీ గారికి చెప్పాను. వంశీ గారికి కథ బాగా నచ్చింది, ఈ సబ్జెక్ట్ డెవలప్ చేస్తున్న ప్రాసెస్ లో అల్లు అరవింద్ గారికి డిటెయిల్డ్ గా నరేట్ చేశాను. అరవింద్ గారికి కథ నచ్చింది అలా గీత ఆర్ట్స్ 2 లో ఈ చిత్రాన్ని ప్రారంభించాము.

 

ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే బాగా ఆజట్టుకున్నారు. కథ గురించి చెప్తారా ?

 

మనిషి పుట్టినప్పుడు సంతోషంగా సెలెబ్రెట్ చేసుకుంటారు. కానీ మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతన్ని మానసికంగా సంతోష పెడితే మరిన్ని ఎక్కువ రోజులు బ్రతుకుతాడానే విషయాన్ని ఎంటర్త్సైన్ గా చెప్పాము. ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే చాలా అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

 

సినిమా మొత్తం పల్లెటూరి నేపథ్యంలోనే ఉంటుందా ?

 

ప్రతిరోజు పండగే సినిమాను రాజమండ్రిలో కొన్ని రోజులు షూట్ చేశాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ కథ కోసం పచ్చని పొలాల్లో కీలక సన్నివేషాలు చిత్రీకరించడం జరిగింది.

 

ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ?

 

సినిమాలు ఐదు పాటలు ఉన్నాయి. థమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. సత్యరాజ్ గారి నటన సినిమాకు ఆదనవు ఆకర్షణ కానుంది.

 

ప్రతిరోజు పండగే షూటింగ్ వివరాలు ?

 

ప్రతిరోజు పండగే ఎనభై శాతం చిత్రీకరణ పూర్తి అయింది. అమెరికాలో ఐదు రోజులు షూట్ చెయ్యాలి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నాము. సినిమా ఔట్ ఫుట్ తో మేము హ్యాపీగా ఉన్నాము. డిసెంబర్ రెండో వారాంలో ఫస్ట్ కాపీ సిద్ధం అవుతుంది. విడుదల తేదీని నిర్మాతలు అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు ప్రకటిస్తారన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు