1997 సినిమాకి కథే హీరో – డైరెక్టర్ మోహన్

1997 సినిమాకి కథే హీరో – డైరెక్టర్ మోహన్

Published on Nov 24, 2021 1:48 AM IST

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్తం 1997. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల అవుతుంది. ఈ సినిమా కి దర్శకత్వం వహించిన మోహన్ మీడియా తో పలు కీలక అంశాల గురించి మాట్లాడారు.

 

1997 సినిమా గురించి చెప్పండి?

ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథ. ఇందులో ఒక అమ్మాయిని రేప్ చేసిన తరువాత ఆమె పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి తాలూకు ఎమోషన్ ఎలా ఉంటుంది. ఒక అమ్మాయిని రేప్ చేసాక చంపేస్తున్నారు. ఎందుకు? అమ్మాయిని రేప్ చేయడానికి కారణం కామం. ఆ కామాన్ని తీర్చుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. ఇది ఓ దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలు కథను చెప్పే ప్రయత్నం. అయితే తక్కువ కులానికి చెందిన వాళ్ళను ఇంట్లోకి రానివ్వరు, గుడిలోకి రానివ్వరు కానీ ఆమెతో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి పనికి వస్తుందా? ఇక్కడ లేని అంటరానితనం అన్నది ఎందుకు అక్కడ లేదు అన్న అంశంతో ఈ సినిమా ఉంటుంది.

 

అంటే ఈ కథ 1997 లో జరిగిందా?

1997 లో జరిగిన కథ కాదు, నేను ఆ సమయంలో విన్న కథ, మా తాతగారు చెప్పిన కథ ఇది. అప్పటినుండి ఆ కథ నా మైండ్ లో అలా ఉండిపోయింది. ఆ కథను తెరపై ఆవిష్కరించాలని ఉద్దేశంతో సినిమాగా తీసాను.

 

ఈ సినిమా ఎలా సెట్స్ పైకి వచ్చింది ?

ఈ కథ ఆలోచన వచ్చాక దాన్ని రాసుకున్నా, ఆ తరువాత నటుడు జీవి నాకు ఫ్రెండ్ ఆయన కథ విన్నాకా చాలా బాగుంది అన్నారు. మరి దీన్ని ఎలా తెరపైకి తేవడం అన్న ఆలోచనలో నిర్మాతలను కలవడం అదంతా వర్కవుట్ అవ్వదన్న ఆలోచనతో మనమే చేయాలనీ మొదలెట్టాం. అలాగే దర్శకత్వం విషయంలో కూడా వేరే దర్శకులను అడిగా, కానీ నేను చెప్పాలనుకున్న కథను మరోలా చెప్పే ప్రయత్నం చేయడంతో, నేనే చెప్పాలని దర్శకత్వం చేశాను.

 

ఇలాంటి సంఘటనల గురించి ఏమి చెప్పాలని మీ ప్రయత్నం ?

వాంఛ తీర్చుకోవడానికి అమ్మాయిని రేప్ చేయాలా? వాంఛ తీర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయ్ కదా. అలాగే తక్కువ జాతి వాళ్లపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

 

సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది ?

సెన్సార్ వాళ్ళు చాలా బాగుంది. మంచి పాయింట్ ఎంచుకుని తీసారని అన్నారు. అక్కడ మహిళా సభ్యులైతే కన్నీళ్లు పెట్టించావని అన్నారు.

 

మొదటి సినిమాకే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చేయడం రిస్క్ అనిపించలేదా?

ఈ కథ అనుకున్నాకా, ఎలాగైనా తెరపై కనిపించాలంటే మనమే రిస్క్ చేయాలనీ ఫిక్స్ అయ్యాను. నిజం చెప్పాలంటే వేరే దారిలేక నేనే చేయాల్సి వచ్చింది.

 

మీ పాత్ర గురించి చెప్పండి?

ఊర్లలో జరుగుతున్న ఈ సంఘటనలను ఆపేందుకు ప్రయత్నం చేసే పోలీస్. అన్ని రకాల షేడ్స్ ఉంటాయి.

 

ప్ర : ఇలాంటి కథ కమర్షియల్ గా చెప్పడం కష్టం. కానీ ఇప్పుడు కమర్షియాలిటీ ఉంటే తప్ప ప్రేక్షకులు చూడరు? మరి దాన్ని ఎలా సెట్ చేసారు ?

ఈ కథను చెప్పుకుంటే పొతే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. దాన్ని కమర్షియల్ హంగులతో చూపించే ప్రయత్నం చేసాం. అయితే ఇందులో ఐటెం సాంగ్, అమ్మాయి ఎక్స్పోజింగ్ లాంటివి ఉండవు.

 

కోటి మ్యూజిక్ గురించి ?

మొదటి సారి చేస్తున్నావు కాబట్టి సినిమా చేయి మొదటి కాపీ వచ్చాక చేస్తానని అన్నారు. తరువాత సినిమా చూసి మోహన్ ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేస్తున్నా, చాలా గొప్పగా తీశావని అన్నారు. ఆయన ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అలాగే ఏమి బతుకు సాంగ్ మంగ్లీ పాడింది. అది 8 మిలియన్ వ్యూస్ వరకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది.

 

నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ ల గురించి ?

ఇందులో నవీన్ చంద్ర నా పై అధికారిగా కనిపిస్తాడు. నవీన్ చంద్ర అద్భుతంగా చేసాడు. శ్రీకాంత్ అయ్యంగార్ నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతారు. ఈ సినిమాలో నేను, నవీన్ చంద్ర హీరోలం కాదు. ఈ సినిమాకు కథే హీరో.

 

ఈ సినిమా విషయంలో నటుడిగా , డైరెక్టర్ గా ఏది సంతృప్తి ఇచ్చింది ?

ఈ సినిమా విషయంలో నటుడిగా, దర్శకుడిగా నాకు రెండు సంతృప్తి ఇచ్చాయి.

 

నెక్స్ట్ సినిమా ఎప్పుడు ?

ప్రస్తుతం ఈ సినిమా పైనే ఫోకస్ పెట్టాము. ఇది విడుదలైన తరువాత మిగతా సినిమా గురించి ఆలోచిస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు