ప్రత్యేకం : బర్త్ డే స్పెషల్ – వి.వి వినాయక్ తో రాపిడ్ ఫైర్ రౌండ్

ప్రత్యేకం : బర్త్ డే స్పెషల్ – వి.వి వినాయక్ తో రాపిడ్ ఫైర్ రౌండ్

Published on Oct 9, 2012 11:15 PM IST


టాలీవుడ్లో భారీ ఫ్యాక్షనిజం సినిమాలను అందించి, తన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న దర్శకుడు వి.వి వినాయక్. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఒక ప్రత్యేక రాపిడ్ ఫైర్ రౌండ్ జరిపాము. ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ రౌండ్లో మేము ఆయన్ని ఏమేమి ప్రశ్నలు అడిగామో, వాటికి వినాయక్ గారు ఏమి సమాధానాలు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం…

ప్రశ్న) మీరు ఇండస్ట్రీలోకి రావడానికి స్ఫూర్తి ప్రదాత ఎవరు?
స) ఈ.వి.వి సత్యనారాయణ. ఆయన కూడా నేను పుట్టిన స్వస్థలంలోనే పుట్టారు మరియు ఆయన అంత ఫేమస్ కావాలని నిర్ణయించుకున్నాను.

ప్రశ్న) మీ పనిలో ఎక్కువ ఏ దర్శకుని ప్రభావం కనిపిస్తుంది?
స) టేకింగ్ లో రామ్ గోపాల్ వర్మ మరియు కంటెంట్ విషయంలో కె. రాఘవేంద్ర రావు.

ప్రశ్న) మీకు ఇష్టమైన హీరో?
స) మెగాస్టార్ చిరంజీవి. నేను 7వ తరగతి చదివేటప్పటి నుంచి ఆయన అభిమానిని మరియు గతంలో నేను మెగాస్టార్ ఫాన్స్ అసోషియేషన్ కి ప్రెసిడెంట్.

ప్రశ్న) మీకు ఇష్టమైన హీరొయిన్?
స ) విజయశాంతి

ప్రశ్న) మీరు ఏ సినిమాని ఎక్కువ సార్లు చూసారు?
స) అప్పట్లో ఎక్కువ సార్లు ‘ఖైదీ’ సినిమా చూసాను, డైరెక్టర్ అయ్యాక ‘పోకిరి’ ఎక్కువ సార్లు చూసాను.

ప్రశ్న) మీ సినిమాల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి?
స) ‘ఆది’ సినిమాలో వచ్చే ‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’ మరియు ‘ఠాగూర్’ సినిమాలోని ‘ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం’. ఈ రెండు డైలాగ్స్ అంటే ఇష్టం.

ప్రశ్న) ఇండస్ట్రీలో ఉండే వారిలో మీరు ఎవరితో ఎక్కువ సమయం గడిపారు?
స) జూ ఎన్టీయార్. మాకు ఎప్పుడు ఖాళీ టైం దొరికినా సరదాగా గడుపుతుంటాము.

ప్రశ్న) మీ డ్రీంప్రాజెక్ట్ ఏంటి?
స) రజనీకాంత్ గారితో సినిమా చేయడం.

ప్రశ్న) మన దర్శకులలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
స) ఎస్.ఎస్ రాజమౌళి, మేమిద్దరం మంచి స్నేహితులం.

ప్రశ్న) మీకు నచ్చిన హాలిడే స్పాట్?
స) నా సొంత ఊరు చాగళ్ల మరియు స్విట్జర్లాండ్.

ప్రశ్న) మీరు ఏ సినిమాకోసం బాగా కష్టపడి షూట్ చేసారు?
స) బద్రినాథ్

ప్రశ్న) ఇండస్ట్రీలో బెస్ట్ విలన్ ఎవరు?
స) ప్రకాష్ రాజ్. చూడటానికి సాఫ్ట్ గా కనపడే ప్రకాష్ రాజ్ విలనిజం చాలా సూపర్బ్ గా చేస్తాడు.

ప్రశ్న) మీకు బాగా ఇష్టమైన పాట?

స) ‘ఠాగూర్’ సినిమాలోని ‘కొడితే కొట్టాలిరా’ మరియు ‘ఆది’ సినిమాలో నుంచి ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ పాటలంటే ఇష్టం

ప్రశ్న) మీకు నచ్చిన ఫుడ్?
స) నాకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ మరియు స్వీట్స్ అంటే ఇష్టం

ప్రశ్న) మీరు డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు?
స) ఒక థియేటర్ మానేజర్ అయ్యుండే వాన్ని.

అంతటితో వినాయక్ గారితో రాపిడ్ ఫైర్ రౌండ్ ముగిసింది. వినాయక్ గారిని అడిగిన ప్రశ్నలు మరియు సమాధానాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా మరోసారి వి.వి. వినాయక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

రాపిడ్ ఫైర్ రౌండ్ – మల్లెమాల టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు