ఇంటర్వ్యూ : హవీష్ – ఓంకార్ మొండి కానీ తెలివి ఉంది
Published on Jun 24, 2013 8:30 pm IST

Havish
‘నువ్విలా’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన హీరో హవీష్ ఆ సినిమాతో మంచి మార్కులే వేసుకున్నాడు. ఆ తర్వాత ఓంకార్ దర్శకత్వం వహించిన ‘జీనియస్’ సినిమా చేసాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర అంతా బాగా ఆడలేదు. ఇప్పుడు హవీష్ తన మూడవ సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండనుంది. ఈ రోజు తను తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళుతుంటే ఆయనతో కాసేపు ముచ్చటించాం. అతను తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, అలాగే ఓంకార్ తో సినిమా ఎలా ఒప్పుకోవడం జరిగింది మొదలైన విషయాలను మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం ..

ప్రశ్న) నటుడిగా మీకు బాగా చాలెంజింగ్ గా అనిపించిన సినిమా ఏది? ‘నువ్విలా’ లేదా ‘జీనియస్’?

స) నా మొదటి సినిమాతో నటుడిగా చాలా నేర్చుకున్నాను. ‘నువ్విలా’ తో మొదటిసారిగా కెమరా ముందుకు వచ్చాను. ఆ సినిమాతోనే నేను బేసిక్స్ నేర్చుకున్నాను. ‘జీనియస్’ అనేది కమర్షియల్ ఫిల్మ్. ప్రతీది బాగా గ్రాండ్ గా, భారీగా ఉంటుంది. కమర్షియల్ సినిమా బేసిక్స్ ఆ సినిమాతో నేర్చుకున్నాను.

ప్రశ్న) రెండవ సినిమాతోనే అలాంటి కమర్షియల్ సినిమాని ఎందుకు చేసారు?

స) నేను ఏదీ ప్లాన్ చెయ్యలేదండీ. ఆ కథ నా దగ్గరికి వచ్చింది, నచ్చింది ఓకే చేసాను. సినిమాకి మాస్ సెంటర్స్, సింగల్ స్క్రీన్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి రివ్యూలు అంత సరిగ్గా పడలేదు, అలాగే మల్టీ ప్లెక్సుల్లో ఆడలేదు. కానీ బి, సి సెంటర్లలో నన్ను ఆదరించారు.

ప్రశ్న) ఓంకార్ పైన ప్రజల్లో నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. అలాంటి తనతో పనిచేయడం రిస్క్ అనిపించలేదా?

స) నిజమే. ప్రజల్లో ఓంకార్ పై నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. ఆ ప్రభావాన్నే మేము ఎ సెంటర్స్ లో ఫేస్ చేసాము. కానీ బి, సి సెంటర్లలో మాత్రం హ్యాపీ రిపోర్ట్స్, అక్కడ జీనియస్ బాగా ఆడింది. కావున అది మించి నిర్ణయమా? లేక చెడు నిర్ణయమా? అంటే నాకు తెలియదు. మాస్ లో అది ఫలించినందుకు నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. నాకు స్టొరీ చెప్పడానికి వచ్చినప్పుడు ఓంకార్ బాగా సున్నితమైన వ్యక్తిలా అనిపించాడు అలాగే తెలివైన వారు.

ప్రశ్న) మీరు ఎలా స్క్రిప్ట్ ని ఎంచుకుంటారు?

స) కథలో మనసుకు హత్తుకునే ఫీల్ ఉంటె చేస్తాను. అలాగే నేను క్వాలిటీ కూడా చూసుకుంటాను. ఫిలిం మేకింగ్ అంటే బాగా ఫాషన్ ఉండే వారితో కలిసి పనిచేసాను. వాళ్లకి సినిమా క్వాలిటీ, టెక్నికల్ స్టాండర్డ్స్ బాగా తెలుసు. చిన్ని కృష్ణ గారు స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఎలా ఉంటుందనే బేసిక్స్ నేర్పించాడు, వాటినే నేను కథ ఎంచుకునేటప్పుడు వాడుకుంటాను. చివరికి కొన్ని సార్లు లక్ కలిసొస్తే చెడ్డ కథలు కూడా మంచి టెక్నీషియన్స్ వల్ల పెద్ద హిట్స్ అవుతాయి.

ప్రశ్న) మీరు ఏదైనా కొత్త సినిమాకి సైన్ చేసారా?

స) ఆస్కార్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో నిర్మించే ఓ సినిమాకి సైన్ చేసాను. ఆస్కార్ రవిచంద్రన్ విశ్వ సుందర్ ఈ సినిమాకి నిర్మాత. శంకర్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అతను ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో షూట్ చేస్తున్నాం అలాగే మలయాళంలో డబ్ చేయనున్నాము. గోవాని ఆధారంగా చేసుకొని తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది.

ప్రశ్న) చూస్తుంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. మీకు తమిళ్, కన్నడ మాట్లాడగలరా?

స) లేదండి, నేను మాట్లాడలేను. ఆ విషయం నేను చాలా క్లియర్ గా నిర్మాతకి చెప్పాను. కానీ వాళ్ళు నేను చేయగలనని చాలా నమ్మకంగా ఉన్నారు. కావున ఆ భాషల్లో నా పెర్ఫార్మన్స్ బాగోలేకపోతే నన్ను కారణం చెయ్యొద్దు(నవ్వులు). కానీ నేను తెలుగు రాని వారు తెలుగులో ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలుసు. కావున నేను కూడా చేయగలననుకుంటున్నాను.

ప్రశ్న) నటుడిగా మెరుగుపడడం కోసం ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు?

స) నేను ప్రతి సినిమాని కొత్త దానిలా తీసుకుంటున్నాను. నా పాత్ర కోసం ప్రత్యేకంగా హోం వర్క్ చేస్తున్నాను. నా సినిమా పూర్తి కాగానే నేను దాని గురించి వదిలేసి నా బిజినెస్ చూసుకుంటాను. నేను మళ్ళీ సినిమా మొదలు పెడితే అప్పుడు బిజినెస్ ని మధ్యలోకి తీసుకురాను. ఆ పనిని నా ప్రొఫెషనల్స్ ఇచ్చేస్తాను. నాకు తెలిసి నేను రెండూ ఒకేసారి బాలన్స్ చెయ్యలేనని అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనా ఒక సమయంలో ఒకదాన్నే ఎంచుకుంటాను.

ప్రశ్న) మీ అభిమాన నటుడు/నటి ఎవరు?

స) తెలుగులో వెంకటేష్ గారు విలక్షణ నటుడు, ప్రయోగాత్మక సినిమాలు చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఆ విషయంలో నాకు కమల్ హాసన్ అంటే కూడా చాలా ఇష్టం. వీరిద్దరూ నాకు ఇష్టమైన నటులు. కానీ నేను తెలుగులోని అందరి టాప్ స్టార్స్ సినిమాలని ఎంజాయ్ చేస్తాను.

ప్రశ్న) మరి హీరోయిన్ సంగతేమిటి?

స) (ఒకసారి ఆలోచించనివ్వండి).. నాకు తమన్నా అంటే ఇష్టం . మంచి నటి, అలాగే లుక్ చాలా బాగుంటుంది. అలాగే నాకు అంజలి అంటే కూడా ఇష్టం.

ప్రశ్న) మీ బర్త్ డే రోజు ఎలాంటి స్పెషల్ ప్లాన్స్ వేసుకున్నారు?

స) నేను మామూలుగా నా బర్త్ డే ని బాగా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోను. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలాంటివి చేయాలని ఆశిస్తున్నాను. చిన్ని కృష్ణ గారు నా బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసారు, ఇప్పుడు దానికి వెళ్ళాలి.

ప్రశ్న) మీ ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు?

సా) నాకున్న ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ తో కూర్చొని చిట్ చాట్ చేస్తుంటాను. నాకు పబ్ లు, డిస్కోలు అంటే ఇష్టం ఉండదు. నాకు అలాంటి సౌండ్స్ మరియు జనాలు నాకు నచ్చరు.

అంతటితో తన రాబోయే సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాము.

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

 
Like us on Facebook