ఇంటర్వ్యూ: హీరో గోపిచంద్ – “సీటిమార్” ప్రతి ఒక్కరిని గ్యారెంటీగా ఆకట్టుకుంటుంది!

Published on Sep 7, 2021 11:13 pm IST

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సీటిమార్”. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న మంచి అంచనాల మధ్య రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా హీరో గోపిచంద్ మీడియాతో ముచ్చటించారు.

 

సీటిమార్‌తో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?

సంపత్ నందితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది, తొలుత ఓ కథతో వచ్చాడు, నాకు అది నచ్చకపోవడంతో నెల తర్వాత ఈ కథతో నా దగ్గరకు వచ్చాడు. స్టోరీ లైన్ నాకు బాగా నచ్చింది, స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో నేను మునుపెన్నడు సినిమా చేయలేదు. అందుకే ఈ కథకు వెంటనే ఒకే చెప్పేశా.

 

ఇంతకు ముందు కబడ్డీ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన సినిమాలకు ఈ సినిమాకు ఏమైనా దగ్గర సంబంధం ఉంటుందా?

ఇంతకు ముందు రెండు మూడు సినిమాలు కబడ్డీ నేపధ్యంలో వచ్చాయి, కానీ ఈ సినిమాలో అమ్మాయిలను తీసుకుని చేయడం, ఎమోషన్స్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని మిక్స్ చేసి చేసిన సినిమా ఇది.

 

కబడ్డీలో మీరు ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా?

నేను ఈ సినిమాలో కోచ్ అని, కోచ్‌కి ట్రైనింగ్ అవసరం లేదని కానీ కబడ్డీ గురుంచి నేను చాలా విషయాలు తెలుసుకున్నా. ఇకపోతే ఈ సినిమాలో నలుగురు నిజమైన ప్లేయర్లు ఉన్నారు, వారు నేషనల్స్ వరకు వెళ్లొచారు, వారు ఆ స్థాయికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు ఎదురుకున్నారో తెలిశాక చాలా బాధ అనిపించింది, వారు ఈ సినిమా కోసం కూడా ఎంతో కష్టపడి చాలా డెడికేటెడ్‌గా పనిచేశారు.

 

ఈ సినిమాలో సీటిమార్ కొట్టించే సన్నివేశాలు ఉన్నాయా?

మాకైతే అన్ని సన్నివేశాలు బాగానే ఉన్నాయని అనిపించింది, సెప్టెంబర్ 10న థియేటర్లలో ప్రేక్షకులే చెబుతారు ఎక్కడ సీటీలు వేయాలన్నది. ఈ సినిమాలో స్పోర్ట్స్ డ్రామాతో సహా సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందని, ఇందులో హీరోకి ఒక గోల్ ఉంటుందని ఆ గోల్ పిల్లలతో ఎలా రీచ్ అయ్యాడు అనేది కొత్తగా చూపించాం.

 

సంపత్ నందితో ఇది రెండో సినిమా కదా మీకు ఎలా అనిపిస్తుంది?

సంపత్ నందితో వర్క్ చేయడం నాకు కంఫర్ట్‌గానే అనిపిస్తుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా “గౌతమ్ నంద” మేము అనుకున్న రిజల్ట్ రాలేదని, కొన్ని మిస్టేక్స్ కూడా అందులో గ్రహించామని, అయినా కూడా అప్పుడే సంపత్‌తో మరో సినిమా చేస్తానని చెప్పానని గతంలో చేసిన మిస్టేక్స్ మళ్లీ రిపీట్ చేయకూడదని గట్టిగా అనుకున్నామని, అలా అనుకునే ఈ కథను చేశాం.

 

తమన్నా పాత్ర ఇందులో ఎలా ఉండబోతుంది?

తమన్నాతో నేను తొలిసారిగా చేశాను, ఇందులో తెలంగాణ కబడ్డీ టీంకి కోచ్‌గా ఆమె చేసిందని, తన క్యారెక్టర్ కూడా ఇందులో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని, తన సీన్స్ అన్ని కూడా బాగుంటాయని, ఖచ్చితంగా తను కూడా ఆకట్టుకుంటుంది.

 

ఈ సినిమాకు మణిశర్మ గారు సంగీతం అందించారు కదా ఎలా అనిపించింది?

ఈ సినిమాకు మణిశర్మ గారు సంగీతం అందిస్తున్నారని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే నాకు తెలియకుండా ఓ నమ్మకం వచ్చింది, ఇంతకు ముందు నా సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఈ సినిమాకు కూడా ఆయన మంచి సాంగ్స్ అందించారు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 

ఓటీటీ పై మీ అభిప్రాయం?

ఓటీటీ అనేది ఒక మంచి ప్లాట్‌ఫాం, ప్యూచర్ ఇంకా ఓటీటీ బాగుంటుందని, కానీ థియేటర్ అనేది ఎప్పటికీ ఉంటుందని, ఓటీటీ అనేది ఒక అడ్వాంటేజ్. థియేటర్‌లో సినిమా చూడడమనేది ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్ అని ఏదైనా ఒక మంచి సీన్‌ని థియేటర్‌లో అయితేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు.

&nbsp

ఇలాంటి సినిమాలు మిగతా లాంగ్వేజ్‌లలో వర్కౌట్ అవుతాయా?

స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఖచ్చితంగా అన్ని లాంగ్వేజీలలో వర్కౌట్ అవుతుందని, కబడ్డీ అనేది మాసీ గేం అని, ఈ ఆట గురుంచి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందని, అలాంటి ఆటను పక్కా ఎమోషన్స్‌తో చూపిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అనిపించే ఈ సినిమా చేశాం.

 

ఈ సినిమాతో మాస్ ఆడియన్స్‌కి మరింత దగ్గర కాబోతున్నారా?

ఈ సినిమా ఒక్క మాస్ ఆడియన్స్‌కే కాకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి, మంచి సాంగ్స్ పడ్దాయి.

 

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అప్డేట్ ఏంటి?

నేను ప్రస్తుతం చేస్తున్న “పక్కా కమర్షియల్” ఆల్ మోస్ట్ అయిపోవొచ్చిందని, శ్రీవాస్‌తో కూడా ఒక సినిమా చేస్తున్నా. మా బ్యానర్‌లో కూడా ఖచ్చితంగా మళ్లీ సినిమా చేస్తా, కానీ కాస్త టైం పట్టొచ్చు.

సంబంధిత సమాచారం :