ఒక నెలలో అబ్బుర పరిచే ప్రకటన చేస్తా : హీరో సిద్దార్థ్

ఒక నెలలో అబ్బుర పరిచే ప్రకటన చేస్తా : హీరో సిద్దార్థ్

Published on Nov 16, 2011 1:25 AM IST

ఈ సాయంత్రం 123తెలుగు.కామ్ హీరో సిద్దార్థ్ తో ముట్టడించింది. ఈ సందర్భంలో ఆయన అన్నివిషయలనూ దాపరికం లేకుండా మనసు విప్పి పంచుకున్నారు. ఇటీవల విడుదలైన ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో పాటు అతను చేయబోతున్న ప్రాజెక్ట్ ల గురించి కూడా సిద్దార్థ్ వివరించారు. అతని మాటల్లో విశ్వాసం తొనికిసలాడింది. ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఇప్పుడు మీ కోసం.

Q . ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రం పై మిశ్రమ స్పందన వస్తోన్న తరుణంలో మీ అనుభూతి ఎలావుంది?

A . బావుంది. ఈ చిత్రం సీడెడ్, నైజం అంతటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతుంది. హైదరాబాద్ లోని అనేక థియేటర్లలో మేము సినిమా చూసి వచ్చినప్పుడు అక్కడ ప్రజల్లో విశేష స్పందన కనిపించింది. ఇది చాలా ఆనందకరం.

Q . మీ బొమ్మరిల్లు చిత్రం అద్భుతమైన విజయం సాధించిన మూలంగా అన్ని సినిమాలపై అదే తరహ అంచనాలు పెట్టుకోవటం మీకు ఏమైనా ఇబ్బంది కలిగించే పరిణామమా..?

A . కొంతమంది బొమ్మరిల్లు వంటి సక్సెస్ కోసం జీవితాంతం ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతటి ఘనవిజయం అనతికాలంలోనే రావటం నా అదృష్టం. ఇది భారంగా నేనెందుకు భావిస్తాను.? ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోవటం అనేది మంచి విషయం. బొమ్మరిల్లు లాగే నేను నటించే ప్రతి చిత్రాన్నీఎంజాయ్ చేస్తాను. ఐదు సంవత్సరాల అనంతరం దిల్ రాజు తో జతకట్టినప్పుడు బొమ్మరిల్లు వంటి చిత్రాన్ని ఆశించటం సహజం. అలానే ఓ మై ఫ్రెండ్ కూడా మంచి విజయాన్ని సాధించింది.

Q . వ్యాపార అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా..?

A . ఖచ్చితంగా, నేను ఇవాళ కూడా చూసాను అనేక మంది కుటుంబసమేతంగా ఈ సినిమా చూసేందుకు తరలి వస్తున్నారు. ఇది ఆశాజనక పరిణామం. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. రెండో వారం కూడా ఇంత క్రౌడ్ ఉండటం ఆనందం కలిగిస్తుంది.

Q . ఈ సినిమా చిత్రీకరణ లో తోటి నటీనటులతో పొందిన అనుభవాల గురించి చెప్పండి?

A . నవదీప్, శ్రుతి, హన్సిక తో పనిచేసినప్పుడు నేను చాల ఎంజాయ్ చేసాను. నవదీప్ తో తొలి రోజునుంచీ చివరి వరకూ చాల ఆనందంగా సాగింది. ఈ మూవీ లో చివరిగా నటించింది హన్సిక తోనే. ఆమెతో పనిచేయటం అద్భుతంగా ఉంది. శ్రుతి, హన్సిక మద్య కెమిస్ట్రీ చాలా విభిన్నంగా సాగటంతో పాటు బాగా పండింది.

Q . వేణు శ్రీరామ్ తో పనిచేయటం గురించి..?

A . వేణు చాల మంచి మిత్రుడు. అతనితో తప్పకుండా మళ్ళీ పని చేస్తా. అతనికి ఏమి కావాలో ఖచ్చితంగా తెలుసు. తొలి చిత్రం తోనే మంచి ప్రయోగాలతో ఆయన ముందుకురావటం మెచ్చుకోవాల్సిందే. ఈ చిత్రం లో డైలోగ్స్ అంత బాగా రావటానికి వేణునే కారణమని నేను దిల్ రాజు చాలా సందర్భాలలో అనుకున్నాం. అతను మా అంచనాలను చేరుకున్నాడు. చివరి 20 నిమిషాల షో అత్యద్భుతంగా రావటానికి వేణునే కారణం.

Q . డైరెక్టర్ లలో అత్యంత డిమాండ్ కలిగింది ఎవరు ?

A. నేను దీపా మెహతా అని చెబుతాను. ఆమె చాలా ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు చాలా కష్ట సాద్యమైన పనులు చేపడుతుంది. ఆమె చిత్రం (సల్మాన్ రిష్ది మిడ్ నైట్ చిల్డ్రన్ ) ఆధారంగా తెరకెక్కించిన సినిమా నిజంగా అద్భుతం.

Q . ఓ మై ఫ్రెండ్ లోని చందు పాత్ర మీ మునుపటి చిత్రాల్లో కెల్లా కష్ట మైనదా..?

A . అవును. ఈ పాత్ర కోసం నేను చాల కష్టపడ్డ. అంతేకాదు బాగా హోం వర్క్ చేశా. బొమ్మరిల్లు చేసిన ఐదేళ్ళ తర్వాత చేసిన యంగ్ బాయ్ పాత్రకు చాలా మంది అభినందించారు. అలాగే ప్రతీ కొత్త చిత్రం ఓ కొత్త పాత్రను కోరుకుంటుంది. ప్రతీ చిత్రానికి కొత్తవానివలె నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది.

Q . ఈ సినిమా లో రెండు పాటలు పాడారు కదా..ఈ నిర్ణయానికి కారణం ఏమిటి..?

A .అసలు, దిల్ రాజు, వేణు సినిమాలోని అన్ని పాటలు నన్నే పాడమన్నారు. కానీ నేను రిస్క్ తీసుకోదలచు కోలేదు. అందుకని రెండు ముఖ్యమైన పాటల వరకే పరిమితమయ్యాను. ‘మా డాడి పోకేట్స్’ సాంగ్ పాడటం కష్టమనిపించింది.

Q . కెరీర్ పట్ల మీరు సంతృప్తి గా ఉన్నారా..?

A . అవును. ‘నువ్వస్తానంటే నేనొద్దంటాన’ చిత్రం తర్వాత నా కెరీర్ చాలా ఛాలెంజింగ్ గా మారిపాయింది. అప్పటి నుంచీ ప్రతి క్షణాన్ని నేను చాల ఎంజాయ్ చేస్తున్నాను. 2012 వ సంవత్సరం నా జీవితం లో మరువలేనిది కాబోతుంది. ఈ ఏడాది నాలుగు భాషల్లో నటించిన చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇది నాకు మంచి సంవత్సరం గా నాకు గుర్తుండి పోతుంది. అంతేకాదు నేను మరో నెలలో ఓ అతి పెద్ద ప్రకటన చేయబోతున్నాను. (నవ్వుతూ)

ఇవండీ… సిద్ధార్థ్ చెప్పిన ముచ్చట్లు. అతని భవిష్యత్తు ఫలప్రదం కావాలని మనం కూడా కోరుకుందాం. అలాగే సిద్దార్థ్ చేయబోయే సంచలన ప్రకటనకోసం ఎదురు చూస్తూ ఉందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు