కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “పరాశక్తి”. ఈ చిత్రం తన కెరీర్ లో అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు కానీ తన కెరీర్ భారీ హిట్ చిత్రం ‘అమరన్’ తర్వాత మళ్ళీ అదే సినిమా నిర్మాత కమల్ హాసన్ తో సినిమా అధికారికంగా ఇప్పుడు అనౌన్స్ అయ్యింది. నిన్ననే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రీ అప్డేట్ తో తెలియజేశాము.
ఇప్పుడు అనుకున్నట్టు గానే ఒక సాలిడ్ పోస్టర్ తో శివ కార్తికేయన్ తో కమల్ రెండో సినిమా అనౌన్స్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో మూడు నామాలతో కూడిన ఒక బళ్ళాన్ని పట్టుకున్న యోధునిగా శివ కార్తికేయన్ లుక్ ని కొంచెం రివీల్ చేశారు. ఇక ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రేపు ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఆ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది అనేది రేపు రివీల్ కానున్నాయి.


