ఇంటర్వ్యూ : మారుతి – సెల్ఫిష్ పాత్రలు రాసుకోవడానికి నాకు నేనే స్ఫూర్తి..!

ఇంటర్వ్యూ : మారుతి – సెల్ఫిష్ పాత్రలు రాసుకోవడానికి నాకు నేనే స్ఫూర్తి..!

Published on May 14, 2014 6:00 PM IST

Director-Maruthi

వరుసగా ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాలతో విజయం అందుకున్న డైరెక్టర్ మారుతి డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ ‘కొత్త జంట’. అల్లు శిరీష్, రెజీన జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీసు వద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ టూర్ విశేషాలను పంచుకోవడానికి మారుతి కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) కొత్త జంట సినిమాకి మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది?

స) ఈ సినిమా విడుదలై ఇప్పటికి 2 వారాలైంది. ఈ సినిమాకి వస్తున్న ఫీడ్ బ్యాక్, రెస్పాన్స్ చూసి నేను షాక్ అవుతున్నాను..

ప్రశ్న) అంటే మీరు మీ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదా.?

స) నాకు మొదటి నుంచి ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్మకం ఉంది అది కూడా అర్బన్ ఏరియాల్లో.. కానీ ఈ సినిమాకి రూరల్ ఏరియా నుంచి మరియు నేను ఊహించని కొన్ని ఏరియాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో నేను చాలా హ్యాపీ గా ఉన్నాను.

ప్రశ్న) ఇప్పటి వరకూ జరిగిన ఈ సినిమా బిజినెస్ గురించి చెప్పండి.?

స) కొత్త జంట రిలీజ్ అయిన రెండు వారాలైంది. మేము ఇప్పటి వరకూ ఈ సినిమాకి పెట్టింది ఈ రెండు వారాల్లో మాకు వచ్చేసింది. ఇక నుంచి ఏమి వస్తుందో అది లాభం.

ప్రశ్న) ఈ సినిమాలో రెండు సెల్ఫిష్ పాత్రలను క్రియేట్ చెయ్యడానికి మీకు స్ఫూర్తి ఎవరు?

స) నవ్వుతూ .. స్వతహాగా నేనొక సెల్ఫిష్ పర్సన్. ఈ రెండు పాత్రలు రాసుకోవడానికి నన్నే స్పూర్తిగా తీసుకొని రాసాను.

ప్రశ్న) శిరీష్ రీ లాంచ్ చెయ్యాలని అనుకున్నప్పుడు మీరేమన్నా ఒత్తిడి ఫీలయ్యారా.?

స) లేదండి.! నేనెప్పుడూ అలా అనుకోలేదు. ఇంకా చెప్పాలంటే తను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. ఆ ఇమేజ్ మొదటి రెండు వారాలు ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆ తర్వాత అతని నటన చూసే థియేటర్ కి ఆడియన్స్ వస్తారు. ఆ విషయంలో శిరీష్ సక్సెస్ అయ్యాడు.

ప్రశ్న) కొత్త జంట సినిమాకి గాను మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?

స) ఈ సినిమా చూసాక రామ్ చరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. మనస్పూర్తిగా నన్ను అభినందించాడు.

ప్రశ్న) మీరు నితిన్ తో చేస్తామన్న సినిమా ఏమయ్యింది? ఎప్పుడు మొదలవుతుంది?

స) ముందుగా నా తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటి వరకూ నేను ఏ సినిమాని ఖరారు చేయలేదు. ప్రస్తుతం కథ రాసుకునే పనిలో ఉన్నాను. ఇక నితిన్ సినిమా విషయానికి వస్తే నేను జస్ట్ నితిన్ కి స్టొరీ లైన్ మాత్రమే చెప్పాను. అది అతనికి నచ్చింది. ఇక అది ఏమవుతుంది అనేది ముందు ముందు చూడాలి.

ప్రశ్న) అలాగే మీరు వెంకటేష్ తో చేస్తామన్న సినిమా కూడా వాయిదాపడిందా?

స) నేను కొత్త జంట సినిమాతో బిజీగా ఉన్న సమయంలో వెంకటేష్ గారు ‘రాధా’ సినిమా కోసం 4 నెలలు వెయిట్ చేసారు. స్క్రిప్ట్ విషయంలో మళ్ళీ వాయిదా పడడంతో వెంకటేష్ గారిని వేరే సినిమా చేయమని చెప్పాను. దాంతో ఆయన ప్రస్తుతం దృశ్యం రీమేక్ లో బిజీగా ఉన్నారు..

ప్రశ్న) ‘ప్రేమకథా చిత్రమ్’ హిందీ రీమేక్ ఎంతవరకూ వచ్చింది?

స) ప్రస్తుతానికి లైన్ లో ఉంది.. హిందీ వెర్షన్ కూడా నేనే డైరెక్ట్ చేస్తాను. ఈ సినిమాకి సంబందించిన నటీనటులు ఎవరు, ప్రొడక్షన్ టీం గురించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాను..

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు